Site icon HashtagU Telugu

Nalgonda: మహిమానిత్వం.. చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయం

Mahashivratri

Mahashivratri

Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఈ క్షేత్రమును త్రేతా యుగం లో పరుశారాముడు కార్తవీర్యర్జునుడిని వధించి ఆ తరువాత విశ్వా కల్యానార్థమై 108 క్షేత్రములలో శివలింగాన్ని ప్రతిస్టించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. అట్టి క్షేత్రములలో చివరిదైన ఈ క్షేత్రం లో శివలింగాన్ని ప్రతిష్టించి ఘోరమైన తపస్సు చేశాడు . ఎంతకు స్వామి వారి దర్శనం కలగలేదు దానికి కోపోద్రుక్తుడై ఆ శివలింగం పై పరశువు (గొడ్డలి ) తో కొట్టాడు అంతలో స్వామి ప్రత్యక్షమవుతాడు. ఈ క్షేత్రం పరమ పవిత్రంగా విరాజిల్లుతుంది

14 నుంచి జాతర

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ చేసారు. రెండవ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బుధవారం సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్ మరియు ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వాహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు.

సచివాలయంలోని తన ఛాంబర్ లో బ్రహ్మోత్సవాల పోస్టర్, సమాచార కరపత్రాన్ని విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ నెల 14 న జాతర ప్రారంభం అవుతుందని.. 16వ తేది అర్ధరాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై 17వ తేది ఉదయం ముగుస్తుందని అన్నారు.