శ్రీవారి భక్తులకు (Tirumala Devotees) మరోసారి చిరుత (Cheetah ) భయం పట్టుకుంది. గతంలో శ్రీవారి మెట్ల మార్గంలో పలుసార్లు చిరుత (Cheetah ) సంచారం చేయడం తో పాటు ఓ చిన్నారిని సైతం హతం చేసిన ఘటనలు జరుగగా..తాజాగా మరోసారి చిరుత శ్రీవారి మెట్టు ప్రాంతంలో సంచారం కలకలం సృష్టించింది. శనివారం రాత్రి కంట్రోల్ రూమ్ వద్దకు రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. భయంతో సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ సెక్యూరిటీ గార్డు అటవీ అధికారులకు , టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చిరుత జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా.. జాగ్రత్తగా ఉండాలంటూ భక్తులకు సూచనలు చేస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లాలంటూ హెచ్చరిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో అలిపిరి మార్గంలో చిన్నారిని చంపేసింది ఓ చిరుత. అప్పుడు ఆరుచిరుతలను బంధించి జూపార్క్‌కు తరలించారు అధికారులు. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించడంతో భక్తులు, అధికారులు టెన్షన్ పడుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు భక్తులకు ఎటువంటి అపాయం జరగకుండా చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also : Tirumala Laddu : నీ ఆసుపత్రిలో చేసుకో భజన..:మాధవీలతపై పేర్ని నాని ఫైర్