హనుమంతుడిని పూజించడానికి శనివారం ఉత్తమమైన రోజు. హనుమాన్ ను ఆరాధిస్తూ…శనివారం ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనస్సు పెట్టి హనుమాన్ ను కొలిచిన భక్తుల దు:ఖాలను తొలగిస్తాడని నమ్ముతారు. వీరుహనుమంతుని శని అనుగ్రహం పొందడానికి శనివారం నియమాల ప్రకారం..మంత్రిస్తూ జంపించాలి. ఉపావాసం ఉంటూ ఆరాధన చేసినట్లయితే భయం, బాధ, శత్రువులను నాశనం చేయడానికి సంకట మోచన హనుమాన్ అద్బుతమైన మంత్రాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
మొదటి మంత్రం
“ఓం హమ్ హనుమతే రుద్రమకాయ హమ్ ఫట్”
శత్రువుల వల్ల కలిగే సమస్యల నుండి బయటపడటానికి ఈ మంత్రాన్ని జపించండి. అన్ని సమస్యల విముక్తి లభిస్తుంది.
రెండవ మంత్రం
“ఓం హుం హనుమతే నమః”
హనుమంతుని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా, ఒక వ్యక్తి కోర్టు సంబంధిత విషయాలలో ప్రయోజనాలను పొందుతాడు. ఈ మంత్రం ప్రభావంతో మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకావం ఉంటుంది.
మూడవ మంత్రం
“ఓం నమో భగవతే హనుమతే నమః”
మీ కుటుంబంలో సమస్యలు ఉన్నట్లయితే…ఈ మంత్రాన్ని జపించండి.
నాల్గవ మంత్రం
మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతం వరిష్ఠం|
వటాత్మజం వానరయుతాముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే||”
ఈ మంత్రాన్ని పఠింస్తే, బజరంగబలి ప్రసన్నుడవుతాడు. తన భక్తులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. తన భక్తుల కోరికలను తీర్చడంతోపాటు బాధలను తొలగిస్తాడని నమ్ముతారు.
ఐదవ మంత్రం
ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసంహరణాయ
సర్వరోగ హరాయ సర్వవశికరణాయ రామదూతాయ స్వాహా.’’
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చు. దీంతోపాటు రోగాలను నయం చేయడంతోపాటు కష్టాలను దూరం చేస్తుంది.