Marriage: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ నాలుగు విషయాలపై క్లారిటీ తెచ్చుకోండి?

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని చె

  • Written By:
  • Publish Date - July 6, 2023 / 08:30 PM IST

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కూడా కంటూ ఉంటారు. అందుకే అమ్మాయిలు అబ్బాయిలు ఎన్నో సంబంధాలు చూసి ఏరి కోరి మరి భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలని, కష్టం, సుఖం, సంతోషంలో అన్నింటా తనతో కలసి నడవాలని ఆరాటపడతారు. కుటుంబంలో సంతోషాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా ఒకరికొకరు అండగా నిలవాలనుకుంటారు.

మరి ముఖ్యంగా స్త్రీలు కన్నవారిని పుట్టింటి వారిని అప్పటివరకు అనగా 20 ఏళ్ల వరకు ఉన్న ప్రపంచాన్ని విడిచిపెట్టి మరొక ప్రపంచానికి వెళుతూ ఉంటారు. అటువంటి పెళ్లి విషయంలో తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలి. అందుకే పెళ్లిచేసుకునే ముందే అమ్మాయిలో ఈ నాలుగు లక్షణాలను గమనించాలని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. మరి ఆ నాలుగు విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందంగా కనిపిస్తోంది. ఆకట్టుకునేలా ఉంది. సిగ్గుతో చక్కగా మెలికలు తిరుగుతోందని అమ్మాయి అందం చూసి ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధపడాల్సి ఉంటుంది.

కాబట్టి అందాన్ని చూసి కాకుండా మాట్లాడేవిధానం, మంచి గుణం కలిగిన అమ్మాయిని ఎంచుకుంటే జీవితం సంపూర్ణంగా సంతోషంగా ఉంటుంది. మహిళకు ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు, సహనం. ఆ రెండూ లేనప్పుడు వాతావరణం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓర్పు సహనం మనిషిని చూడగానే అర్థమవుతాయా ఏంటి అని అడగొచ్చు.నిజమే కానీ మాట్లాడే విధానం, కొన్ని విషయాలపై స్పందించే తీరుని బట్టి ఆ వ్యక్తికి సహనం, ఓర్పు ఉందో లేదో తెలుసుకోవచ్చు. కాబట్టి ఓర్పు సహనంతో ఉన్న మహిళలను పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు అయినా కూడా ఎదిరించవచ్చు. ట్రెండ్ ఎంత మారిపోయిన కూడా సంస్కృతి సంప్రదాయాలు ఆచార పద్ధతులను పాటించే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం మంచిది.

సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అన్నీ పాటించేస్తారని కాదు .పెరిగిన వాతావరణం ప్రబావం కొంతైనా ఉంటుంది. కోపం అమ్మాయిలకు మాత్రమే కాదు ఎవ్వరికైనా ప్రధమ శత్రువు. తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఊరికే చెప్పలేదు. మీ జీవితంలోని అమ్మాయిని ఆహ్వానిస్తున్నప్పుడు ఇదే విషయాన్ని గమనించాలి. చీటికి మాటికీ కోపం, ఆవేశం ప్రదర్శించే మహిళ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో విఫలం అవుతుంది.