Chankya niti : ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. లేదంటే మీ జీవితాన్ని నరకం చేస్తారు..!!

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 04:42 AM IST

ఆచార్య చాణక్యుడి సూత్రాలు అడుగడుగునా జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తాయి. చాణక్యుడి ఆలోచనలను అనుసరించే వారు జీవితంలో మోసపోవడం చాలా అరుదు. తన నీతిలో ఒక వ్యక్తి జీవించి ఉండగానే అతని జీవితాన్ని నరకం చేసే కొంతమంది వ్యక్తుల గురించి వివరించాడు. ఇలాంటి వ్యక్తులకు మనకు దగ్గరి సంబంధం ఉంటుందని వారిని ప్రతిరోజూ కలుస్తామని చెప్పారు. అలాంటి వ్యక్తులు మీతో ఎక్కువగా కాలం ఉంటే జీవితం నరకం అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా వారికి దూరంగా ఉండటమే మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. చాణక్యుడు తన నీతిలో ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో తెలిపారు.

“దుష్ట భార్యా శతం మిత్రం భృత్యశ్చోత్తరాజిషః”.
స-సర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయః|”

1. దుష్ట స్వభావం ఉన్న భార్య:
ఒక వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైన సహచరుడు అతని భార్య. దుష్ట స్వభావం, మాటతీరులో చేదు, అబద్ధాలు, మోసం, అలాంటి భార్యతో జీవిస్తున్న వ్యక్తి నరకంలో జీవిస్తున్నట్లే. ఇది భర్త జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా పిల్లలు, కుటుంబాన్ని ప్రతికూలంగా మారుస్తుంది. వివాహానికి ముందు స్త్రీలో అలాంటి లక్షణాలు కనిపిస్తే, ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకునే ముందు ఒక వ్యక్తి వందసార్లు ఆలోచించాలి. అలాంటి స్త్రీని పెళ్లాడితే ఆ వ్యక్తి వైవాహిక జీవితం నరకప్రాయంగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు.

2. మొండి సేవకుడు:
మీ ఇంటి సేవకుడు మొండిగా ఉంటే, యజమానిని అగౌరవపరిచి, తిరిగి ప్రతీకారం తీర్చుకుంటే, అతన్ని దూరంగా పెట్టండి. అలాంటి సేవకుల సహవాసం మృత్యువును ఆహ్వానించినట్లే. కాబట్టి అలాంటి వారిని ఇంట్లో ఉంచుకోకపోవడమే మంచిది. వారు ఎప్పుడైనా మీకు ద్రోహం కానీ హాని కానీ చేయవచ్చు. లేదా వారు సమాజంలో మీ గౌరవాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నం చేయవచ్చంటాడు చాణక్యుడు.

3. స్వార్థ మిత్రుడు:
స్నేహితులు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. స్నేహితుల గురించి చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలాసార్లు వివరించాడు. మీ ముందు స్నేహితుల వలె ప్రవర్తించే వ్యక్తులు, మీతో మంచి స్నేహాన్ని కలిగి ఉంటారు. కానీ మీ వెనుక మిమ్మల్ని అవమానించే లేదా ఇతరులకు మీ గురించి చెడుగా చెప్పే వ్యక్తులు స్నేహానికి అర్హులు కారు. మోసం చేయడం వారి స్వభావం, మీరు మోసం చేయడానికి భయపడని సమయం వస్తుంది. అలాంటి స్నేహితులు ఒక్కోసారి ప్రాణం తీయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించరని చాణక్యుడు చెప్పాడు.

చాణక్యుడు తన నీతిలో పేర్కొన్న ప్రకారం, మన జీవితంలోని విలువైన క్షణాన్ని పై వ్యక్తులతో గడిపే సాహసం చేయకూడదు. అలాంటి వారితో సహవాసం చేస్తే మన జీవితాలే నష్టపోతాయని చాణక్యుడు చెబుతున్నాడు.