Chanakya Niti: శత్రువులను ఓడించాలంటే ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదు!

శత్రువుని ఓడించాలి అంటే, అనుక్షణం శత్రువుపై మనం ఒక కన్ను వేసి ఉంచాలి. అతడు ఎలాంటి వ్యూహాన్ని

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 01:30 PM IST

శత్రువుని ఓడించాలి అంటే, అనుక్షణం శత్రువుపై మనం ఒక కన్ను వేసి ఉంచాలి. అతడు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నాడు. ఏ విధంగా మనల్ని దెబ్బ కొట్టబోతున్నాడు అన్న ప్లాన్ లను పసిగట్టి మన ప్లాన్ లు అమలు చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అయితే మనకు మనమే శక్తివంతులము అని భావిస్తూ ఎప్పుడు మౌనంగా ఉండిపోకూడదు. అలా ఉండటం అవివేకం అని చెబుతోంది చాణుక్యనీతి. ఒకవేళ శత్రువులను మీరు ఓడించాలి అనుకుంటే చాణిక్య నీతి చెప్పిన ఈ నాలుగు విషయాలను ఎప్పుడు గుర్తించుకోవాలి. ఆ నాలుగు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది వ్యక్తులు వారికి వారే బలవంతులుగా భావించుకుంటూ శత్రువులను తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అయితే అలా ఎప్పుడూ ఆలోచించకూడదు అని చాణిక్య నీతి చెబుతోంది. ఒకవేళ మీకంటే శత్రువు బలహీనంగా ఉన్నట్లు అయితే అతడు మిమ్మల్ని ఓడించడానికి సరైన అవకాశం కోసం వేచి చూస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి. అతను ఎప్పటికప్పుడు మీపై నిఘా పెట్టి సమయం దొరికినప్పుడు మెరుపు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకొందరు శత్రువుల మీద చేసే ప్లాన్లను ప్రణాళికలను బయటకు చెబుతూ ఉంటారు. అలా చేయడం కూడా చాలా పెద్ద తప్పు. శత్రువు విషయంలో మీరు ఆలోచించే ప్లాన్లు లేదంటే వ్యూహాలు ఎంత సీక్రెట్ గా ఉంటే అంత మంచిది.

కాబట్టి శత్రువుల విషయంలో వేసే ప్రణాళికల గురించి ఎవరితో కూడా చర్చించకూడదు. ఒకవేళ ఈ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న శత్రువు దాని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తాడు. సాధారణంగా కొందరు వ్యక్తులు వారికి నచ్చని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సమయంలోనే శత్రువు మీ మీద పై చేయి సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మీకు నచ్చని వ్యక్తులను అతని వైపు తెచ్చుకుంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. అదేవిధంగా రిలేషన్స్ విషయంలో కూడా ఎప్పుడూ పరిమితులు దాటకూడదు. ఒకవేళ దాటితే అది మీ శత్రువుకి లాభం చేకూరుస్తుంది.