Chanakya Neeti : మనిషిని పేదవాడిగా మార్చే అలవాట్లు

Chanakya Neeti : చాణక్య నీతి.. మానవ జీవితానికి తిరుగులేని మార్గదర్శకం. ఈ నీతిని పాటిస్తే మనిషి జీవితం మారిపోతుంది.

Published By: HashtagU Telugu Desk
Chanakya Niti

Chanakya Niti

Chanakya Neeti : చాణక్య నీతి.. మానవ జీవితానికి తిరుగులేని మార్గదర్శకం. ఈ నీతిని పాటిస్తే మనిషి జీవితం మారిపోతుంది. మానవాళికి వివిధ విషయాలపై సలహాలను ఇవ్వడంతో పాటు సరైన మార్గదర్శకత్వాన్ని చూపే ప్రత్యేకత చాణక్య నీతి సొంతం. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ జీవితాలలో ముందంజలో ఉండాలి అనుకునేవారు తప్పకుండా ఆచార్య చాణక్యుడి నీతిని అనుసరించాలి. ఈ నీతి శాస్త్రంలో ముఖ్యమైన అనేక సూత్రాలు, విధానాలు ఉన్నాయి. ఇవి విజయం వైపు వ్యక్తికి దిశానిర్దేశం చేస్తాయి. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తిని పేదవాడిగా మార్చే కొన్ని అలవాట్ల గురించి చెప్పారు. వాటిని తెలుసుకొని అలర్ట్ అవుదాం. తద్వారా పేదరికం నుంచి మనమంతా బయటపడొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

మురికిగా జీవించేవారు

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మురికిగా జీవించేవారు ఎల్లప్పుడూ పేదరికంలోనే ఉంటారు. పరిశుభ్రత అనేది రోజువారీ మానవ జీవితంలో కనీస నియమం. శుభ్రమైన బట్టలు ధరించని వారు.. చుట్టూ మురికి వాతావరణంలో కాలం గడిపేవారు.. ఎల్లప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతారు.. అందుకే ఇలాంటి అలవాట్లను మనం వదిలివేయాలి.

కటువుగా మాట్లాడే వ్యక్తులు 

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. కటువుగా మాట్లాడే వాళ్లతో లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉండదని చాణక్యుడు అంటాడు. అందుకే మనం ఇతరులతో సౌమ్యంగా మాట్లాడాలి. కటువుగా మాట్లాడే స్వభావాన్ని మార్చుకోవాలి. కటువుగా మాట్లాడటం వల్ల ఇతరులతో మన సంబంధాలు చెడిపోతాయి. ఆర్థిక పురోగతిలో సహకరించే వాళ్ల కొరత కారణంగా మనం పేదవాళ్లుగా మారిపోతాం.

సూర్యాస్తమయ టైంలో నిద్రపోయేవాళ్లు 

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే టైంలో  నిద్రించే వారు ఎల్లప్పుడూ పేదలుగా ఉండిపోతారు.  ఈ సమయంలో నిద్రించే వారికి తల్లి లక్ష్మి తన అనుగ్రహాన్ని అందించదు. అందుకే పొరపాటున కూడా సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు.

సోమరితనం

ఆచార్య చాణక్యుడి ప్రకారం(Chanakya Neeti).. సోమరితనం కలిగిన వారు పేదలుగానే ఉండిపోతారు. ఇది ఒక చెడ్డ అలవాటు. సోమరితనం వల్ల మీరు పనిలో విజయం సాధించలేరు. జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా మీరు సోమరితనాన్ని వదిలేయాలి.

సక్రమంగా లేని వ్యయం 

అనవసర ఖర్చులు ఎక్కువగా చేసేవారు, లెక్కలేకుండా ఖర్చులు చేసేవారు ఎప్పటికీ పేదరికంలోనే ఉండిపోతారు.  ఆదాయానికి అనుగుణంగా ఖర్చులను నియంత్రించుకునే వారే జీవితంలో విజయం సాధిస్తారు. కాబట్టి మీ ఖర్చులను ప్లాన్ చేసుకోండి. మీ అవసరాలలో ఏది ముందు.. ఏది తర్వాత అనేది గుర్తించండి. వాటి ప్రకారం ఖర్చులు చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బును పొదుపుగా ఖర్చు చేయండి.

Also Read: SBI Jobs: SBIలో 5 వేలకు పైగా పోస్టులు.. ఇంకా రెండ్రోజులే గడువు..

  Last Updated: 16 Dec 2023, 06:51 AM IST