Rahukalam: రాహూకాలంలోనూ కొన్ని పనులు చేయోచ్చు…అవేంటో తెలుసా..?

  • Written By:
  • Publish Date - May 30, 2022 / 07:00 AM IST

హిందూసంప్రదాయం ప్రకారం..రాహుకాలంలో ఎలాంటి కార్యాలు చేయకూడదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. ఈ సమయాన్ని చెడుగా భావిస్తుంటారు. అందుకే రాహుకాలంలో ప్రయాణం చేయకూడదు…శుభముహుర్తలు వంటివి చేయకూడదు..కల్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడాదని చెబుతుంటారు. అయితే రాహుకాలం గురించి చాలా మందికి తెలియదు. అసలు రాహుకాలం అంటే ఏమిటి…ఈ కాలంలో చేయాల్సిన పనులేంటి…చేయకూడని పనులేంటీ…అనే విషయాలను తెలుసుకుందాం.

రాహుకాలం అంటే ఏమిటి..?
శాస్త్రాల ప్రకారం…శుభసుముహుర్తంలోనే శుభకార్యాలు చేయాలని పండితులు చెబుతుంటారు. సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు ఉండే సమయాన్ని ఎనిమిది భాగాలుగా చేస్తే అందులో ఒక భాగాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు. ఈ రాహుకాలం ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ప్రతి రోజు సుమారు 90 నిమిషాలు అనగా..గంటన్నర సమయం రాహుకాలం ఉంటుంది. అయితే ప్రతిరోజూ ఒకేలా ఉండదు. అది సమయాన్ని బట్టి…ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది.

రాహుకాలం ఎప్పుడు వస్తుంది…!!

ఉదాహణకు ఒక ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 6 గంటలకు.. సూర్యస్తమయం 6 గంటలకు అనుకుంటే.. ఉదయం 6 నుండి 7:30 గంటల వరకు అంటే.. మొదటి గంటన్నర సమయాన్ని రాహుకాలంగా పరిగణించాలి. తర్వాత సోమవారం రోజున 7:30 నుండి 9 గంటల వరకు, శనివారం రోజున ఉదయం 9 నుండి 10:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, మంగళవారం రోజున 3 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు, ఆదివారం రోజున సాయంత్రం 4:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ రాహు కాలం ఉంటుంది.

రాహులాన్ని ఎందుకని అశుభంగా భావిస్తారు..!!
హిందూశాస్త్రాల ప్రకారం..సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, శని, రాహు, కేతువు ఇవన్నీ నవగ్రహాలు. వీటిలో రాహు, కేతు భౌతిక శరీరాలు లేకపోయినప్పటికీ…వీటికి సూర్యుడిని అస్పష్టం చేసే శక్తి ఉంటుందని భావించారు. దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుందని భావించారు. రాహువు సూర్యుడిని మింగే పాము. ఇది చెడు సంకేతానికి ప్రతీకగా భావిస్తుంటారు. అందుకే ఈ రాహుకాలాన్ని అపవిత్రంగా చెబుతుంటారు. ఇలాంటి సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.

ప్రతికూల శక్తి…!!
రాహుకాలంలో రాహువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఈ కాలంలో ఈగ్రహం ప్రతికూల శక్తితో ఎక్కువ ప్రభావితమవుతుందని భావిస్తుంటారు. అందుకే ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. ఎంతముఖ్యమైన పని ఉన్నా కానీ వాయిదా వేస్తుంటారు.

ఏం చేయకూడదు..!
-రాహుకాలంలో విలువైన వస్తువులను అస్సలు కొనరాదు
-ప్రయాణాలు చేయరాదు.
-ఇళ్లు కొనడం, అమ్మడం, గ్రుహప్రవేశం, నగలు కొనడం వంటివి చేయకూడదు.
-కొత్త పనులను ప్రారంభించకూడదు.
-రాహుకాలంలో పెళ్లి ముహుర్తాలు పెట్టకూడదు.

ఏం చేయాలి..!
సాధారణంగా రాహుకాలంలో ఏ పనులు చేయవద్దని..అది అశుభమన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కాలంలో కూడా కొన్ని పనులు చేయవచ్చు. వీటి గురించి చాలా మందికి తెలియదు. ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉంటుందో…దాని నివారణకు రాహుకాలమే సానుకూలమని పండితులు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయట. రాహుగ్రహం శాతం కోసం పశువులకు ఆహారం తినిపించాలి.