Site icon HashtagU Telugu

Fake Ayodhya Prasadam : అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం..వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

Ayodya Prasadam

Ayodya Prasadam

అయోధ్యలో రాముడి (Ayodhya Rama Mandir) ప్రాణప్రతిష్ఠ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. కోట్ల మంది ప్రజలు ఎప్పుడెప్పుడు రామచంద్రస్వామిని దర్శించుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఆ దివ్యస్వరూపాన్ని గర్భగుడిలో చూసి తరించాలని ఆశతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో మోసగాళ్లు అయోధ్య రాముడి పేరు చెప్పి దందాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు అయోధ్య రామాలయ ఫొటోస్ , రాముడి ఫొటోస్ అంటూ లింక్స్ పెట్టి..అవి క్లిక్ చేయగానే అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేయడం చేస్తున్నారు. అయోధ్య పేరుతో ఎలాంటి లింక్స్ వచ్చిన వాటిని క్లిక్ చెయ్యొద్దని చెపుతున్నారు. ఇదిలా ఉండగానే ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ (amazon) అయోధ్య ప్రసాదం (Ayodhya Prasadam) అందజేస్తామంటూ ప్రకటన చేయడం పట్ల కేంద్రం సీరియస్ అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

అమెజాన్‌లో కొందరు వ్యాపారులు ‘శ్రీ రాం మందిర్ అయోధ్య ప్రసాదం’ పేరుతో స్వీట్లు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సెంట్రల్ కన్జుమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అమెజాన్‌కు నోటీసులు పంపింది. వారం రోజుల్లో నోటీసులకు స్పందించాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోటీసులపై అమెజాన్ స్పందించింది. సీసీపీఏ నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. సెల్లర్ల సేల్స్ ఆప్షన్‌ను తొలగించినట్టు తెలిపారు.

Read Also : Ramayantra : రామయంత్రం మీద అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఏమిటది ?