Car Vastu Tips: మామూలుగా కారు డ్యాష్ బోర్డ్ బై విగ్రహాలు పెట్టడం మనం గమనించి ఉంటాం. కొందరు దేవుళ్ళ విగ్రహాలు పెడితే మరి కొందరు లాఫింగ్ బుద్ధ అలాగే చిన్న చిన్న జంతువులు పక్షుల బొమ్మలు పెడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విగ్రహాలు పెడుతూ ఉంటారు. అయితే ఇది కేవలం డాష్‌బోర్డ్‌పై ఆసక్తి, అందం కోసం విగ్రహాన్ని ఉంచడం కాదు. ఇంట్లో ఏదైనా పవిత్ర చిహ్నాన్ని మీరు ఎలా గౌరవంగా, బుద్ధిపూర్వకంగా చేస్తారో అదే విధంగా అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ వాహనంలో గణేశుడిని ఉంచుకోవాలని అనుకుంటే దానిని సరైన విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
ఇందుకోసం సరైన విగ్రహాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఇక్కడ ముందుగా మీరు మీ కారు డ్యాష్‌బోర్డు పై సరిగ్గా సరిపోయే విగ్రహాన్ని ఎంచుకోవాలట. అలాగే కార్లు కూడా వేడెక్కుతాయి. కదులుతాయి కాబట్టి చిన్నవి, గట్టిగా ఉండేవి తీసుకోవాలని చెబుతున్నారు. లోహం, రాయి, కలప సాధారణంగా బాగా పట్టుకుంటాయి. చాలా సున్నితమైన లేదా పెద్ద విగ్రహాలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పడిపోతాయట. అలాంటప్పుడు కొన్ని సార్లు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి కారణాల వల్ల డ్రైవింగ్ సమయంలో మీ దృష్టిని మరల్చేలా చేస్తుందట. అలాగే ప్లేస్‌మెంట్ కూడా అంతే ముఖ్యం అని చెబుతున్నారు. కార్ డ్యాష్‌బోర్డుపై పెట్టిన విగ్రహం మీకు ఎదురుగా రోడ్డు కనిపించకుండా చేయరాదట. చాలా మంది దానిని డాష్‌బోర్డ్ మధ్యలో ఉంచుతారు.
కానీ అది మీకు ఎదురుగా ఉన్నవి కనిపించకుండా అడ్డంకిగా మారుతుంది. అందుకే మీకు డ్రైవింగ్ కు అనుకూలంగా ఉండేలా చూసుకుని సరిచేసుకోవాలట. అలాగే మీరు పెట్టిన వినాయకుడి విగ్రహం సరిగ్గా సెట్ అయిపోయి కూర్చునేలా అతికించాలట. ఇంట్లో దేవుళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మీరు ఎలా శుభ్రం చేస్తారో డాష్‌బోర్డ్ ను కూడా క్లీన్ గా తుడుచుకుంటూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట. అంతేగానీ మీరు గణేశుడికి ధూపం, దీపాలు వెలిగించి పూజలు చేసినట్టుగా, కారు లోపల ఇలాంటివి చేయటం సురక్షితం కాదని, అంతేకాదు మరో ముఖ్యమైన నియమం ఏంటంటే కారులో ధూమపానం, మద్యపానం చేయకూడదని మాంసాహారం వంటివి తినకూడదని చెబుతున్నారు. ఎయిర్‌బ్యాగ్ దగ్గర ఇలాంటి విగ్రహాలు ఉంచకూడదు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటే అది చిన్న విగ్రహం అయినా కూడా బలంగా ఎగిరినప్పుడు గట్టిగానే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్యాష్‌బోర్డు నిండా విగ్రహాలు, పూలు, స్టిక్కర్లు, డెకరేషన్లతో నింపేయకూడదట.
Car Vastu Tips: కారు డ్యాష్ బోర్డుపై విగ్రహాలు పెడుతున్నారా. అయితే ఈ విషయాలు మీకోసమే!

Car Vastu Tips