Site icon HashtagU Telugu

Spirituality Tips: ఆదివారం తులసి చెట్టు దగ్గర దీపం పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 22 Jan 2024 07 37 Pm 4766

Mixcollage 22 Jan 2024 07 37 Pm 4766

హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతోపాటు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని కొన్ని సందర్భాలలో తులసికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తులసి మొక్కలు లక్ష్మీదేవి విష్ణువు కొలువై ఉంటారని కాబట్టి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీ విష్ణువు అనుగ్రహంతో పాటు తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కను పూజించడం మంచిదే కానీ తులసి మొక్క విషయంలో పూజ చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేయకూడదు.

ఆ సంగతి పక్కన పెడితే ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదని పండితులు చెబుతుంటారు. మరి ఆదివారం రోజు తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించవచ్చా? వెలిగించకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారం తులసమ్మ.. శ్రీ మహా విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని, అందుకే ఈ రోజున తులసమ్మ కోసం నీటిని సమర్పించకూడదని అంటారు. నీరు పోసి, దీపారాదన చేస్తే ఉపవాసం విరమించబడినట్టు అవుతుందని ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు.

అలాగే ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు. అదే విధంగా తులసి మొక్కను ముట్టుకోకూడదని చెబుతారు. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని, విష్ణువుని కలిసి పూజించకూడదని చెబుతూ ఉంటారు. అందుకే ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం నిషిద్దం. అలాగే బుధవారం రోజు కూడా తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. వీటితోపాటు ఏకాదశి అమావాస్య లాంటి సందర్భాలలో కూడా నీరు సమర్పించకూడదు.