God Rings: దేవుడు ప్రతిమ కలిగిన ఉంగరాన్ని దరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా చేతికి బంగారు లేదా వెండి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం బంగారు ఉంగరాలు ధరిస్తూ

  • Written By:
  • Updated On - November 17, 2022 / 10:43 AM IST

సాధారణంగా చేతికి బంగారు లేదా వెండి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం బంగారు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. అయితే ఈ బంగారు ఉంగరాలలో కొందరు వారికి ఇష్టమైన దేవుడి బొమ్మతో తయారుచేసిన ఉంగరాలు ధరిస్తే మరి కొందరు రాళ్లతో తయారు చేసిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకొందరు రకరకాల డిజైన్లలో వారికి ఇష్టం వచ్చిన విధంగా స్టైలిష్ లుక్ తో కనిపించే విధంగా బంగారం ఉంగరాలను డిజైన్ చేయించుకుని వాటిని ధరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా బంగారు ఉంగరాలలో దేవుళ్లలో వెంకటేశ్వర స్వామి,లక్ష్మీదేవి, గణపతి, శివుడు, సాయిబాబా ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అయితే చాలామందిలో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.

అదేమిటంటే దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాలను చేతివేళ్ళకు ధరించవచ్చా? ఇస్తే ఏమైనా జరుగుతుందా అన్న సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే చాలామంది జ్యోతిష్యులు,పండితులు దగ్గరకు వెళ్ళినప్పుడు పచ్చరాయి ఎర్రరాయి ఉంగరాలు ధరించండి అని చెబితే కొందరు ఆ రాయి,ఈ రాయి ఉంగరాలు ఎందుకు ఏకంగా దేవుడి బొమ్మ కలిగిన ఉంగరాన్ని పెట్టుకుంటే ఏ బాధలు ఉండవు కదా అని దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారు. అలా దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాన్ని చేతికి ధరించడం వల్ల ఆ దేవుడి దయ ఎప్పుడు తమపై ఉంటుందని వారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి అని నమ్ముతూ ఉంటారు.

అయితే దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరం చేతికి ధరించినప్పుడు మనం తినే ఎంగిలి మెతుకులు దేవుడికి తగలడం ఇంతవరకు కరెక్ట్ అన్నది చాలామంది ఆలోచించరు. దేవుడికి నైవేద్యం చేసినప్పుడు మనం దానిని ఎంగిలి చేసి పెడతామా లేదు కదా. అలాగే మనం కుడి చేతితో అన్నం తింటున్నప్పుడు మనం ఆ వేలికి ఉన్న ఉంగరం మీద ఎంగిలి మెతుకులు పడతాయి. అయితే దేవుడి ఉంగరాన్ని ధరించడం మంచిదే కానీ అన్నం తినడానికి ముందు ఆ దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాన్ని తీసివేసి తిని ఆ తర్వాత దానిని పెట్టుకోవడం మంచిది. కాకుండా భగవంతుడికి ఇది నేను ఇచ్చే నివేదన, ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అన్న భావన ఉంటే వేలికి దేవుని ఉంగరం ధరించుకొని భోజనం తినవచ్చు. అలాగే ఈ సమస్త సృష్టిలో పదార్థాలన్నీ దేవుడి సృష్టి నుంచి వచ్చినవే. ఆయనకి ఎంగిలి ఏమిటి అనుకునేవారు.. నిర్మొహమాటంగా ఉంగరం ఉంచుకుని భుజించవచ్చు. అలా ఎవరి భావన వారిది. భావనలో భావం భావ్యంగా ఉండే దేవుని ఉంగరం ధరించిన తప్పు ఉండదు. ఒకవేళ తినేటప్పుడు ఎంగిలి ఆహారం పెడుతున్నాము అనుకుంటే వెంటనే ఆ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టి ఆ తర్వాత ఆ ఉంగరాన్ని ధరించండి.