Site icon HashtagU Telugu

Death People: చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

Death People

Death People

ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఏ దిశలో పెట్టుకోవాలి? ఎవరి ఫోటోలు ఇంట్లో ఉంచుకోవాలి? అలాగే మరణించిన వారి ఫోటోలు పూజ మందిరంలో పెట్టవచ్చా లేదా? ఇలా చేస్తే శుభమా అశుభమా? ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవతలతో సమానం కాబట్టి చనిపోయిన తర్వాత వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చట. మాతా పిత్రులు దేవతలతో సమానం. జన్మనిచ్చిన తల్లి దండ్రులు కాబట్టి దేవతలతో సమానమైన వారేనని చెప్పి ఇంట్లో పూజా మందిరంలో వారి ఫోటోలు పెట్టుకుని పూజించడం కరెక్టే అని చెబుతున్నారు.

ఆదివారం అమావాస్య, మంగళవారం అమావాస్య, శనివారం అమావాస్య రోజున చనిపోయినట్లు అయితే ఆ తల్లిదండ్రుల ఫోటోలను దేవుడి దగ్గర పెట్టకూడదట. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని, ఇంట్లో పెట్టినా నిత్యం వాటిని చూడకూడదని చెబుతున్నారు. తల్లిదండ్రులు దేవతలతో సమానమే. కానీ, వారు చనిపోయినటువంటి సమయం అనేది కీడు, అశుభప్రదమైనది. ఈ వారాల్లో, ఈ తిథుల్లో చనిపోతే శాంతి హోమం జరిపించాలట. అదే ఉదగ శాంతి హోమం. శివుడికి సంబంధించి రుద్రాభిషేకం చేయించాలట. మృత్యుంజయ హోమం జరిపించాలని, అలా చేసినా వారి ఫోటోలు మాత్రం ఇంట్లో పెట్టకూడదట. ఎందుకంటే అశుభ సమయంలో చనిపోయారు కాబట్టి పెట్టకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

అశుభ సమయంలో చనిపోయినట్లు అయితే ఏడాదిలోపు ఆ ఇంట్లో మళ్లీ ఒక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు చెప్పి ఉదక శాంతి హోమం జరిపించాలట. అలా చేస్తే ఆ ఇంట్లో మళ్లీ నష్టం జరగదట. ఆ ఇంటిల్లి పాది శుభంగానే ఉంటుందట. ఇది ఆత్మశాంతి కోసం చేసే పూజా కార్యక్రమం అని ఇది చేస్తే ఆ ఇంటిల్లిపాది అంతా సంతోషంగా ఉంటారని, పాజిటివ్ ఎనర్జీతో శుభప్రదంగా ఆ ఇల్లు కొనసాగుతుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఫోటోలు మాత్రమే పూజా మందరిలో పెట్టుకోవచ్చట. మిగతా వారివి పెట్టకూడదని, దేవుడి పూజా మందరిలో తల్లిదండ్రులు ఫోటోలు మాత్రమే ఉండాలని, అన్నదమ్ములవి, భార్యవి, పిల్లలవి ఫోటోలు పెట్టుకోకూడదట. తల్లిదండ్రుల ఫోటోలు మాత్రమే పెట్టుకోవాలని,అది కూడా దక్షిణం గోడకు పెట్టుకుని ఉత్తర ముఖం చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు శనివారం, ఆదివారం, లేదా మంగళవారం దూపం ఇవ్వడం శుభప్రదం అని చెబుతున్నారు.