Site icon HashtagU Telugu

varalakshmi Vratham: వరలక్ష్మి వ్రతం అప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలో తెలుసా?

Varalakshmi Vratham

Varalakshmi Vratham

శ్రావణమాసంలో పెళ్లయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుమంగళీగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని వరలక్ష్మి దేవి వరాలు ఇస్తుందని నమ్ముతారు. అయితే అన్నీ బాగా ఉన్నాయి. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము అనుకునే లోపే కొన్ని కొన్ని సార్లు అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా మహిళలను ఆందోళన కలిగించే విషయం పిరియడ్స్. చాలా మంది మహిళలకు పూజకు అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అనుకోకుండా వెంటనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి.

అయితే అలా అవాంతరాలు ఏర్పడినప్పుడు ఏం చేయాలి పండుగను జరుపుకోవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… అలా మధ్యలో అవాంతరాలు ఏర్పడినప్పుడు మళ్లీ నెక్స్ట్ వారం అంతే తదుపరి వారం పూజలు జరుపుకోవడం మంచిది. అలా జరుపుకోవచ్చని పండితులు కూడా చెబుతున్నారు. అప్పుడూ ఇబ్బంది ఎదురైతే నవరాత్రులలో ఒక శుక్రవారం ఈ వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చని శాస్త్రం చెప్తోంది. వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాము.

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తారు. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు తెలిపాయి. కొందరు మహిళలు ఈ పండుగను చాలా సింపుల్గా జరుపుకుంటే మరికొందరు మాత్రం ఇంట్లో అమ్మవారిని చక్కగా రెడీ చేసి భక్తిశ్రద్ధలతో పూజించి ముత్తైదువులకు వాయనాలు కూడా అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి ఇంట్లోనే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆరోజు పూజ జరుపుకొని ఐదు మంది ముత్తైదువులతో ఆశీర్వాదాలు కూడా తీసుకుంటూ ఉంటాడు .