Site icon HashtagU Telugu

Pregnant: స్త్రీలు గర్భం దాల్చినప్పుడు పూజలు వ్రతాలు చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Pregnant

Pregnant

సాధారణంగా పూజ చేసేటప్పుడు ఎన్నో రకాల విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల పూజ ఫలితం దక్కకపోగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా మహిళలు పూజ చేసేటప్పుడు ఎన్నో రకాల విషయాలను గుర్తించుకోవాలి. తరచూ మహిళలు పూజలు వ్రతాలు అభిషేకాలు అంటూ దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అలాగే కార్తీకమాసం మాఘమాసం ఆ నెలలో దేవాలయాలను సందర్శిస్తూ నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అయితే స్త్రీలు పూజ చేయడం మంచిదే. కానీ స్త్రీలు గర్భం దాల్చినప్పుడు అనగా గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయవచ్చా? వ్రతాలు ఆచరించవచ్చా? ఎన్ని నెలల వరకు చేయాలి? ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి.

ఆ విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.. ఇంట్లో గర్భవతి అనగా మూడు నాలుగు నెలలు నిండిన గర్భవతి ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు కొత్త నిర్మాలను చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఇంటికి మార్పులు, చేర్పులు కాని, కొత్త నిర్మాణం చేపట్టడం గానీ మంచిది కాదు. పండితులు తెలిపిన మేరకు గర్భవతులు తేలికపాటి పూజా విధానం మాత్రమే అవలంబించాలి.

కొబ్బరికాయలు కొట్టకూడదు అలాగే గుడి చుట్టూ ప్రదర్శనలు కూడా చేయకూడదు. పూజలు చేయడం కంటే గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిది. అయితే స్త్రీలు 5వ నెల వచ్చేవరకు వ్రతాలు చేయవచ్చు. ఐదు నెలల నిండిన తర్వాత స్త్రీలు వ్రతాలు చేయకూడదు. ఇందుకు గల కారణం పూజలు వ్రతాలు చేసేవారు ఎక్కువసేపు నేలపై అలాగే కూర్చోవడం మంచిది కాదు. అలాగే పూజలు వ్రతాలు చేసినప్పుడు కొన్ని ప్రదేశాలు కొన్ని పుణ్యక్షేత్రాలు కొండలపై, భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. అటువంటి ప్రదేశాలకు గర్భవతులు వెళ్లడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది..

Exit mobile version