Site icon HashtagU Telugu

మనీప్లాంట్ ను ఇతరులకు బహుమతిగా ఇవ్వవచ్చా.. ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Mixcollage 21 Jan 2024 03 35 Pm 7052

Mixcollage 21 Jan 2024 03 35 Pm 7052

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్ళలో మనీ ప్లాంట్ తప్పనిసరిగా ఉంటోంది. ఇళ్లతో పాటు ఆఫీసులలో అలాగే వ్యాపార ప్రదేశాలలో కూడా ఈ మనీ ప్లాంట్ ను పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటిని అందంగా ఉంచడంతో పాటు వాస్తు పరంగా కూడా ఇది ఇంట్లో శ్రేయస్సును కొనసాగించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయితే మాములుగా కొందరు కొన్ని సందర్భాలలో మనీప్లాంట్ మొక్కను ఇతరులకు బహుమతిగా కూడా ఇస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. ఇలాంటి మనీ ప్లాంట్ మొక్కను కొందరు ఇతరులకు బహుమతిగా కూడా ఇస్తూ ఉంటారు. మరి అలా ఇవ్వడం మంచిదేనా ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనీ ప్లాంట్‌ను ఎవరికీ ఇవ్వవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇంట్లో నాటిన మనీ ప్లాంట్‌ను ఎంత దగ్గరి వారైనా ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ఐశ్వర్యం పోతుంది. అలాగే మనీ ప్లాంట్‌ను ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి. ఇలా చేయడం అశుభం. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం, సరైన దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

తప్పు దిశలో ఉపయోగించడం వల్ల మీ జీవితంపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి, ఈ మొక్కను ఈశాన్యంలో, అంటే ఈశాన్య మూలలో ఎప్పుడూ నాటకూడదు. ఈ దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తి నిలువదు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో నాటాలి. ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సంతోషం ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఎండిపోయిన మనీ ప్లాంట్ ఆకులను తీసి పారవేస్తూ ఉండాలి. లేదంటే అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అలాగే ఈ చెట్టు తీగలు ఎప్పుడూ పైకి పాకే విధంగా మార్చుకోవాలి. కింద నేలపై తీగలు పాకడం అస్సలు మంచిది కాదు.