Site icon HashtagU Telugu

Last Rites: కూతురు తల్లిదండ్రులకు తలకొరివి పెట్టవచ్చా.. పెట్టకూడదా?

Mixcollage 13 Jul 2024 11 55 Am 8100

Mixcollage 13 Jul 2024 11 55 Am 8100

ప్రస్తుత రోజుల్లో చాలామంది మగ పిల్లలు కావాలని.. కొడుకులు పున్నామ నరకం నుంచి రక్షిస్తారని చనిపోయిన తర్వాత కొడుకులే తలకొరివి పెడతారని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడపిల్లలు పుట్టినా కూడా వద్దు అనుకోని చెత్త కుప్పల్లో పారేసి మరీ వెళ్తున్నారు. మరోవైపు పిల్లలు కలగక ఎంతోమంది హాస్పిటల్స్ చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సంగతి అటు ఉంచితే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మగపిల్లలు మాత్రమే తల కొరివి పెట్టాలని ఆడపిల్లలు తల కొరివి పెట్టకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు.

అందుకే ఆడపిల్లలు మాత్రమే వున్నారని, కొడుకులు లేరని చాలా మంది బాధపడిపోతుంటారు. ఆడపిల్లలను కన్నవాళ్లే అదృష్టవంతులు. ఒక్క ఆడపిల్ల వున్నా వంశం మొత్తం తరిస్తుంది అని శాస్త్రాల్లో పురాణాల్లో వుంది. ఎందుకంటే ఆడపిల్లకు పెళ్లి చేసే సమయంలో కన్యాదానం చేసే సందర్భంలో ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావిస్తారు. పెళ్లి కొడుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కన్యాదానం సమయంలో అమ్మాయి తల్లిదండ్రుల చేత ఒక విష్ణు స్వరూపుడా నీకు నా కూతురును లక్ష్మీదేవిగా భావించి నీకు కన్యాదానం చేస్తున్నాను. కన్యాదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూర్వం ఆడపిల్లలు లేని వారు ఎవరైనా ఒక ఆడపిల్లను కన్యాదానం చేసేవారు. కన్యాదానం చేయడం వల్ల తల్లిదండ్రులు శాశ్వతంగా స్వర్గలోకంలో వుంటారని శాస్త్రం చెబుతోంది.

కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఆడపిల్లలను కన్న వాళ్లు అదృష్టవంతులుగా భావించాలి. సీతాదేవిని కన్యాదానం చేసి జనకమహారాజు మోక్షాన్ని పొందాడు. ఆడపిల్లలను కన్నవారికి శాశ్వత బ్రహ్మనివాసం వుంది. అదేవిధంగా ఆడపిల్ల తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి దహన సంస్కారాలు చేయవచ్చు. కూతురుకి కొడుకు లేకపోతే, లేదా తల్లిదండ్రులకు శిశ్యుడు లేకపోతే, బంధువుల్లో ఎవరైనా తలకొరివి పెట్టవచ్చు. వాళ్లు కూడా లేకపోతే అల్లుడు తలకొరివి పెట్టవచ్చు. అల్లుడు కూడా లేని సందర్భంలో కూతురు పిండ ప్రదానం చేసి దహన సంస్కారాలు చేయవచ్చు. కూతురికి తల్లిదండ్రి లేకపోతే తాతను కన్యాదానం చేయవచ్చు. లేదా పెద్దమ్మ, పెద్దనాన్న చేయవచ్చు, లేదంటే చిన్ననాన్న, పిన్నమ్మ కన్యాదానం చేయవచ్చు. వీళ్లు కూడా లేకపోతే అన్నావదిన అయినా కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు. మేనమామ కూడా కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు. వీళ్లెవ్వరూ లేకపోయినా తల్లి కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు.