Site icon HashtagU Telugu

Camphor: మీ జేబులో రెండు కర్పూరం బిళ్ళలు వేసుకుంటే చాలు.. డబ్బే డబ్బు!

Camphor

Camphor

కర్పూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కర్పూరం ఆరోగ్య విషయంలోనే కాకుండా ఆధ్యాత్మిక విషయంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. దేవుళ్లకు పూజ చేసేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ఈ కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చాలా రకాల ఆయుర్వేద మందుల తయారీలో కూడా కర్పూరం ను ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. కాగా అయితే కర్పూరం బిళ్ళలను రోజు మన జేబులో వేసుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయట.

అలాగే ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరే ముందు రెండు కర్పూరం బిల్లులు వేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనలోని నెగెటివిటీ తగ్గిపోతుందని చెబుతున్నారు. కర్పూరం బిళ్ళల వల్ల పాజిటివిటీ పెరిగి స్ట్రెస్ తగ్గుతుందట. అంతేకాదు అనుకున్న పనుల్లో విజయం సాధించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు స్నానం చేసే బకెట్లో కూడా కర్పూరం వేసుకుని స్నానం చేయవచ్చని చెబుతున్నారు. అలాగే మీ పర్స్ లో కర్పూరం బిళ్ళలు వేసుకొని అవి కరిగిపోయే వరకు అలాగే పెట్టుకోవాలట. ఆ తర్వాత మళ్లి కొత్తవి పెట్టుకోవాలట.

ఇలా చేయటం వల్ల ఆర్థిక నష్టం నుంచి బయటపడి ధన ప్రవాహం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం కర్పూరం బిళ్ళలు పాజిటివిటీని పెంచుతాయట. ఆర్థిక నష్టాల నుంచి బయట పడేస్తాయట. దీంతో మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని, అప్పుల ఊబి నుంచి బయటపడతారని చెబుతున్నారు.