Site icon HashtagU Telugu

Srisailam: శ్రీశైలం హుండీ లెక్కింపు.. 15 రోజుల్లో 3.87 కోట్లు

Srisailam

Srisailam

Srisailam: శ్రీశైలభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయదేవాలయాల హుండీలలెక్కింపు అక్కమహాదేవి అలంకారమండపములో శుక్రవారం ఉదయంనుండి ప్రారంభించగా రూ.3,87,52,761/-లు నగదు రాబడి వచ్చింది. అదేవిధంగా 263 గ్రాముల 900 మిల్లిగ్రాముల బంగారు,9 కేజీల 700 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీకూడా లభించినట్లు కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు.

భక్తులు కానుకల రూపేణా స్వామివార్ల కు 15 రోజులలో సమర్పించుకున్నదని సమకూరినదని కార్యనిర్వహణాధికారి తెలిపారు.ఈ హుండీలలెక్కింపు కార్యక్రమాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య సిసికెమెరాల నిఘాతోలెక్కింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటి కార్యనిర్వహణాధికారి అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు.

కాగా ఆలయానికి చెందిన వైద్యశాలకు కామినేని ఆస్పత్రి ఎండీ శశిధర్‌ అంబులెన్స్‌ను విరాళంగా అందించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంటిలేటర్‌తో పాటు ఉన్న రూ.50 లక్షల విలువ జేసే అంబులెన్స్‌ను విరాళంగా అందజేశారు. ఆలయ గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో డి.పెద్దిరాజుకు కామినేని యాజమాన్య సభ్యుడు అంబులెన్స్‌ను అందజేశారు.