Holi 2024: హోలీ రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు.. కాసుల వర్షమే?

హిందువులు సంతోషంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ హోలీ పండుగ రోజున చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 12 Mar 2024 09 19 Pm 8451

Mixcollage 12 Mar 2024 09 19 Pm 8451

హిందువులు సంతోషంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ హోలీ పండుగ రోజున చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. కొందరు సంతోషంగా ఇంట్లో పిండి వంటలు చేసుకుని తింటే మరికొందరు భక్తిశ్రద్ధలతో దేవుళ్లను కూడా పూజిస్తూ ఉంటారు. ఇకపోతే హిందువులు ఈ పండుగను ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 మార్చి 25న హోలీ వస్తుంది. మార్చి 24న హోలికా దహన్ జరగనుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున కొన్ని రకాల వస్తువులు ఇంటికి తేవడం వల్ల లక్షీ దేవి కటాక్షం లభిస్తుంది. ఎలాంటి వస్తువులు కొనడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తోరణాలు హిందూమతంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టడం శుభప్రదం. పండుగలు, శుభకార్యాల సమయంలో ప్రధాన ద్వారం వద్ద ఇలాంటి తోరణాలు పెడితే ఎంతో మంచిది. ఇవి నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాలు కడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కలకు మంచి స్థానం ఉంది. ఇవి సానుకూల శక్తికి తెచ్చిపెడతాయి. హోలీకి ముందు మీ ఇంటికి వెదురు చెట్టును తీసుకురావాలి. ఇది అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది.

ఆనందం తెచ్చిపెడుతుంది. వెండి నాణేలు కొనడం చాలా మంచిది. హోలీ కోసం షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెండి నాణెం కొనండి. వెండి నాణేన్ని పూజించి ఎరుపు లేదా పసుపు వస్త్రంలో కట్టి లాకర్లో భద్రంగా ఉంచాలి. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం చాలా మంచిది. హోలీ రోజున ఇంటికి లోహంతో చేసిన తాబేలును తీసుకురావడం చాలా మంచిది. అలాగే తాబేలు వెనుక భాగంలో శ్రీయంత్రం లేదా కుబేర యంత్రాన్ని ఉంచాలని గుర్తుంచుకోవాలి. అలాంటి లోహపు తాబేలును ఇంటికి తీసుకొచ్చి దేవుని గదిలో ఉంచాలి. ఈ కారణంగా ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.

  Last Updated: 12 Mar 2024, 09:19 PM IST