Site icon HashtagU Telugu

Silver: వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ రోజుల్లో కొనుగోలు చేస్తే చాలు.. పట్టిందల్లా బంగారమే!

Silver

Silver

మామూలుగా మనం తరచుగా వెండిని కొనుగోలు చేస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ల సమయంలో ప్రత్యేక రోజుల్లో కావాల్సినప్పుడు సమయం సందర్భానుసారం వెంటనే కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వెండి తగ్గుముఖం పట్టినప్పుడు కూడా వెండిని కొనుగోలు చేస్తూ ఉంటారు. చాలా మంది వెండి ఆభరణాలను ధరించడానికి ఆసక్తి చూపుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, కొన్ని రోజులు వెండి కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయట. వెండి కొనుగోలుకు కొన్ని రోజులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి వెండిని ఎప్పుడు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుష్యమి నక్షత్రాన్ని పవిత్రమైన నక్షత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం వెండిని కొనడం చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో వెండిని కొనడం వల్ల మన జీవితంలో అపారమైన సంపద, ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని చెబుతున్నారు.

అలాగే వెండి కొనుగోలు చేయాలి అనుకున్న వారు గురువారం రోజు కొనుగోలు చేస్తే చాలా మంచిదట. గురువారం వెండి కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావించాలని చెబుతున్నారు. బృహస్పతి సంపద, శ్రేయస్సు యొక్క గ్రహంగా ప్రసిద్ధి చెందాడు. గురువారం వెండి కొనుగోలుకు చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.

అలాగే ప్రతి ఏడాది మనకు ఏప్రిల్ లేదా మే నెలల్లో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఇది ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఆ రోజు వెండి కొనడానికి మరొక శుభ సందర్భం. ఈ రోజున ఏ పెట్టుబడి పెట్టినా అనంతమైన ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే ఈ రోజున ఎక్కువ మొత్తంలో వెండితో పాటు బంగారం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వెండిని కొనుగోలు చేసేటప్పుడు, మీరు దానిని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉన్న దుకాణం నుండి కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.