Site icon HashtagU Telugu

Burning Camphor Benefits: ప్రతీ రోజు రాత్రి కర్పూరంతో ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

Mixcollage 15 Jun 2024 01 27 Pm 6270

Mixcollage 15 Jun 2024 01 27 Pm 6270

కర్పూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కర్పూరాన్ని కేవలం పూజలో మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఔషధాలు తయారిలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూజ చేసిన తర్వాత తప్పకుండా ఇంట్లో అలాగే గుడిలో దేవుడికి హారతి ఇవ్వడం కోసం కర్పూరం ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాస్తు ప్రకారం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తరచుగా ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. ఇంట్లో కర్పూరాన్ని కాల్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోయి దేవుళ్లను ఆకర్షిస్తుంది.

కాగా హిందూ మతంలో కర్పూరానికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. దేవుళ్లకు కర్పూర హారతి ఇచ్చిన తర్వాతే పూజ పూర్తవుతుంది. అంతేకాదు హవన, దహనాల్లో కూడా కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం ఇంట్లో ఒక కర్పూరం చెట్టు ఆకుని కాలిస్తే కూడా ఇంట్లో గాలి శుద్ధి జరుగుతుంది. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ దృష్ట శక్తులు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అలాగే వాస్తు ప్రకారం కర్పూరం లవంగం రెండింటిని రోజు రాత్రి కాలిస్తే ఇంట్లో గాలి ప్యూరిఫై అవుతుంది.

అలాగే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఇది వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. అంతేకాదు ఇంట్లో లవంగం కర్పూరం కలిసి కాల్చడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు రోజు రాత్రి ఇలా కర్పూరాన్ని కాల్చాలి. అంతేకాదు కర్పూరని ఇలా కాల్చడం వల్ల మీ ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇందుకోసం ప్రతి రోజు రాత్రి ఐదు లవంగాలను కర్పూరాన్ని వేసి కాల్చడం వల్ల జీవితంలో జరిగే నష్టాలను నివారిస్తుంది. అంతేకాదు కర్పూరం నుంచి వెదజల్లే ఆరోమా ఇంటి చుట్టుముట్టు ప్రాంతంలో సుఖశాంతులను కలిగిస్తుంది. దీంతో మెదడు శరీరం ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు కనిపిస్తే రెండు లవంగాలతో కర్పూరాలను కాల్చడం వల్ల ఇంటికి సుఖశాంతులో పాటు ఆర్థిక శ్రేయస్సు కూడా కలుగుతుంది.

Exit mobile version