Site icon HashtagU Telugu

Camphor: కర్పూరంతో ఈ మూడింటిని కాలిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!

Mixcollage 21 Jul 2024 11 27 Am 1442

Mixcollage 21 Jul 2024 11 27 Am 1442

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో రకాల పూజలు పరిహారాలు పాటించినప్పటికీ ఆర్థిక సమస్యలు తగ్గలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. చాలామంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాలు పాటిస్తే చాలు తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడంతో పాటు, లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు పండితులు.

ఇందుకోసం కావాల్సిన పదార్ధం కర్పూరం. కర్పూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా కర్పూరం ని మనం వినియోగిస్తూ ఉంటాం. అయితే పూజలతో సంబంధం లేకుండా.. ఇంట్లో మామూలుగా కర్పూరం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుందని, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదని చెబుతున్నారు పండితులు. ఇకపోతే మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో లవంగాలు కూడా ఒకటి. ఈ లవంగాలను, కర్పూరం రెండు కలిపి రాత్రిపూట కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న గాలి శుద్ధి అవుతుందట. ఇది ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుందని చెబుతున్నారు. ఈ రెండు కలిపి కాల్చడం వల్ల.

ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయట. లవంగం, కర్పూరం కలిపి కాల్చడం వల్ల మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోతే అది చేరుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయట. రోజూ సాయంత్రం ఒక పాత్రలో కర్పూరంతో పాటు 5 లవంగాలు వేసి కాల్చాలట. డబ్బు సమస్యలతో పాటు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే బిర్యానీ ఆకును కర్పూరంతో కలిపి కాల్చడం వల్ల వాతావరణం మొత్తం చాలా పవిత్రంగా మారిన అనుభూతి కలుగుతుందట.

మీకు ఏవైనా తీరని సమస్యలు ఉంటే ఆ సమస్యలను బిర్యానీ ఆకుమీద రాసి కర్పూరంతో కాల్చితే సరిపోతుందట. వీలైనంత తొందరగా ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయని చెబుతున్నారు పండితులు. 5 బిర్యానీ ఆకులను కర్పూరంతో కలిపి కాల్చడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయట. ముఖ్యంగా డబ్బు సమస్యలు తీరతాయని చెబుతున్నారు. దాల్చిన చెక్క కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కర్పూరంతో దాల్చిన చెక్కను కలిపి కాల్చాలట. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఉన్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తీరిపోతాయట. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందని చెబుతున్నారు పండితులు.