ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. సామాన్య ప్రజల నుంచి ఈ పెద్ద పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు ఈవీ స్కూటర్లకు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో వీటి డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో అన్ని రకాల కంపెనీలు ఈవీ స్కూటర్లు తయారీని ప్రారంభించాయి. ఇప్పటికే చాలా రకాల కంపెనీలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ కంపెనీ ఏథర్ తన అమ్మకాలను పెంచుకునేందుకు ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఈ ఏథర్ స్కూటర్ సొంతం చేసుకుంది.
ఏథర్ కంపెనీ ఏథర్ 450, ఏథర్ రిజ్తా, ఏథర్ 450 అపెక్స్ స్కూటర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మార్కెట్ లో పెరుగుతున్న పోటీకు అనుగుణంగా అమ్మకాలను పెంచుకునేందుకు ఈ నెలలో ఏథర్ స్కూటర్లను కొనుగోలు చేసే వారికి రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా బ్యాటరీ వారెంటీను పొడగిస్తూ ఏథర్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏథర్ ఈవీ స్కూటర్ కొనుగోలుపై కాంప్లిమెంటరీగా రూ. 5,000 విలువైన తన ఎయిక్ట్ 70 బ్యాటరీ వారంటీ అందిస్తుంది. ఎనిమిదేళ్ల కవరేజీలో వచ్చే ఈ వారెంటీ బ్యాటరీ హెల్త్ 70 శాతం కంటే తక్కువగా ఉంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ వారెంటీ వస్తుంది.
ఏథర్ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్ తగ్గింపులను కూడా అందిస్తుంది. ఏథర్ రిజ్తా ధర రూ. 1.09 లక్షల నుండి ప్రారంభం ఆవుతుంది. అలాగే ఏథర్ 450ఎస్ ధర రూ. 1.15 లక్షలు కాగా, 450ఎక్స్ ధర రూ.1.40 లక్షలుగా ఉంది. ఏథర్ ఫ్లాగ్లిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ 450 అపెక్స్ ధర రూ. 1.94 లక్షలుగా ఉంది.