Silver Broom : అయోధ్య రామమందిరానికి 1.751 కేజీల వెండితో చీపురు

Silver Broom : అయోధ్య రామమందిరానికి వరుసపెట్టి కానుకలు అందుతూనే ఉన్నాయి.

  • Written By:
  • Updated On - January 28, 2024 / 12:17 PM IST

Silver Broom : అయోధ్య రామమందిరానికి వరుసపెట్టి కానుకలు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రకాల కానుకలు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందాయి. తాజాగా అఖిల భారతీయ మాంగ్ సమాజ్ భక్తులు అయోధ్య రామ మందిరానికి చీపురును కానుకగా సమర్పించారు. ఇది వెండితో తయారు చేసిన చీపురు. దీని తయారీ కోసం 1.751 కేజీల వెండిని వినియోగించారు. అఖిల భారతీయ మాంగ్ సమాజ్ భక్తులు ఈ చీపురును తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బాల రాముడి గర్భాలయాన్ని ఈ వెండి చీపురుతో(Silver Broom) శుభ్రం చేయనున్నారు.

7 అడుగుల 3 అంగుళాల నందకం

ఇక  మహారాష్ట్రకు చెందిన నీలేష్ అరుణ్ సకార్ అనే భక్తుడు 7 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండే ఓ నందకాన్ని అయోధ్య రామమందిరానికి కానుకగా సమర్పించారు. దీని బరువు 80 కేజీలు. మహా విష్ణువు దశావతారాల్లో నందకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సీతమ్మ తల్లి జన్మించిన జనక్‌పురి నుంచి నేపాల్ ప్రభుత్వం వెండి విల్లంబులను పంపించింది.

We’re now on WhatsApp. Click to Join.

  •  అయోధ్య రామమందిరంలో ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు.
  • రోజూ తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామివారికి ఇస్తారు.
  • మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి ఉంటుంది.
  • సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో తలుపులను మూసివేస్తారు.
  • స్వామివారి సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్‌ https://online.srjbtkshetra.org/  ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read :Celebrity Single Mothers : సెలబ్రిటీ సింగిల్ మదర్స్.. స్ఫూర్తిదాయక జీవితం

యూపీ పర్యాటక శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లను కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది. కొత్త టూరిజం పాలసీ ప్రకారం నూతనంగా నిర్మితమవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. జనరల్ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హోటళ్ల నిర్మాణం పూర్తికానున్నదని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ తెలిపారు. ప్రస్తుతానికి పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30 వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉ‍న్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్‌లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది.