TTD: తిరుపతిలో వాల్మీకిపురం శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు 

TTD: తిరుపతిలో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 17న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. […]

Published By: HashtagU Telugu Desk
TTD Exchange Rs 2000 Notes

Ttd Will Release The Quota Of Arjita Seva Tickets Online

TTD: తిరుపతిలో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 17న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

  Last Updated: 22 Mar 2024, 07:37 PM IST