TTD ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి బిఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తన మార్క్ కనపరుస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం తో తిరుమల లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడగా..ఇప్పుడు నాయుడు గారి ఆలోచనలు, నిర్ణయాలతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ..భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచిస్తూ వస్తున్నారు.
తాజాగా ఈరోజుతిరుమలలో శ్రీవారి దర్శన ఏర్పాట్లను పరిశీలించేందుకు టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ (BR Naidu Sudden Inspection) చేపట్టారు. క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దర్శన సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మొదట అళ్వార్ ట్యాంక్ గెస్ట్‌హౌస్ (ఏటీజీహెచ్) వద్ద గల స్లాటెడ్ సర్వ దర్శనం క్యూలైన్‌లను పరిశీలించారు. అక్కడ భక్తులతో మాట్లాడి వారు అనుభవించిన పరిస్థితులను తెలుసుకున్నారు. దర్శన సమయంలో ఎదురయ్యే అసౌకర్యాల గురించి భక్తుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్బంగా భక్తులు తమ అభిప్రాయాలను చైర్మన్‌తో పంచుకున్నారు.
అనంతరం నారాయణగిరి షెడ్లకు చేరుకుని ఫుట్‌పాత్ హాల్ (దివ్యదర్శనం) ఏర్పాట్లను పరిశీలించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌లను పరిశీలించి, టీటీడీ సిబ్బంది అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా తమ సూచనలను చైర్మన్‌కు వివరించారు. ఈ తనిఖీల సందర్భంగా భక్తులు టీటీడీ చర్యలపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీవారి లడ్డూల నాణ్యతను ప్రశంసించారు. దర్శన సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల అనుభవాలను అర్థం చేసుకున్న చైర్మన్, వీటిపై త్వరలోనే చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ భక్తుల విశ్వాసాన్ని పెంచింది. ఈ తనిఖీలు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ చొరవగా ముందడుగు వేస్తున్న దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. భక్తుల సౌకర్యాలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరుమల దర్శనం మరింత సులభతరం కానుంది.
Read Also : CJI Sanjiv Khanna: సీఈసీ, ఈసీల ఎంపిక వ్యవహారం.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ