Site icon HashtagU Telugu

TTD: నవంబర్ 06 న టీటీడీ బోర్టు కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతల స్వీకరణ

Br Naidu Ttd Chairman

Br Naidu Ttd Chairman

రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్‌గా TV5 అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)ను, అలాగే పాలక మండలిలో 24 మంది సభ్యులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి దేవస్థానం నిర్వహణకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిచింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించడం విశేషం. అలాగే తెలంగాణకు చెందిన ఐదుగురికి , కర్ణాటకకు చెందిన ముగ్గురికి , తమిళనాడుకు చెందిన ఇద్దరికి , గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు.

కాగా టీటీడీ బోర్టు(TTD Board) కొత్త చైర్మన్(Chairman) గా బీఆర్ నాయుడు ఈ నెల 06 న తన బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఇక తన బాధ్యతలు ఇంకా స్వీకరించకముందే భక్తులకు పలు తీపి కబుర్లు అందించారు నాయుడు. శ్రీవారి ట్రస్టును రద్దు చేస్తామని , తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో గతంలో ఉన్నట్లు టోకెన్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. మెటీరియల్‌ సప్లై, దేవస్థానం భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని స్పష్టం చేశారు. అలాగే శ్రీవారి భక్తులను ఎక్కువసేపు కంపార్టుమెంట్లలో ఉంచడం మంచిది కాదని.. చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లు కంపార్టుమెంట్లలో పిల్లలకు పాలు కూడా ఇవ్వలేదని.. కొత్త ప్రభుత్వం వచ్చాక పాలు, అల్పాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ, హాస్పిటల్స్‌పై తాను దృష్టి సారిస్తానని, తిరుమలలో వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని.. పేపర్‌ గ్లాస్‌లో ఉచితంగా తాగునీరు ఇవ్వాలనేది తన ఆలోచన అని పేర్కొన్నారు.

Read Also : SkyWalk : హైదరాబాద్ లో మరో స్కైవాక్..ఎక్కడంటే..!!

Exit mobile version