Goddesses Lakshmi: ఈ ఐదు వస్తువులు పూజగదిలో ఉంటే చాలు, నట్టింట్లో ధనలక్ష్మి నివాసం ఉన్నట్లే…

ఒక్కోసారి కష్టపడి పనిచేసినా డబ్బులు రావడం లేదా.

  • Written By:
  • Publish Date - May 25, 2022 / 06:14 AM IST

ఒక్కోసారి కష్టపడి పనిచేసినా డబ్బులు రావడం లేదా. తరచుగా అనవసరంగా డబ్బు ఖర్చు అవుతోందా, లక్ష్మీ దేవి చేతికి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతోందా…అయితే దాని వెనుక కారణం వాస్తు దోషమే. వాస్తు దోషాన్ని వదిలించుకోవడానికి, వాస్తు శాస్త్రంలో ఐదు వస్తువులను పూజగదిలో ఉంచాలని సూచించారు. వాటిని పూజ గది లేదా మీ ఇంట్లో ఉంచడం ద్వారా ప్రతికూల శక్తుల ప్రభావం ముగుస్తుంది. ఇంట్లో ఏ వస్తువులు ఉంచాలో తెలుసుకోండి, తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి…

వేణువు-
వాస్తు దోషాలను తొలగించడానికి వేణువు అత్యంత ప్రభావవంతమైన మార్గంగా చెప్పబడింది. ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, ఒక వ్యక్తి ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఇంట్లో బంగారం, వెండి, లేదా వెదురు వేణువును ఉంచాలి.

వినాయక విగ్రహం-
వినాయకుడిని విఘ్నహర్త అంటారు. ఐశ్వర్యం, సంతోషం దక్కకుండా చేస్తున్న అడ్డంకులు తొలగిపోవాలంటే గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఉంచాలి.

లక్ష్మి, కుబేరుడి విగ్రహం-
తల్లి లక్ష్మి మరియు కుబేరుల విగ్రహాలను ఇంట్లో తప్పనిసరిగా ఉంచాలి. లక్ష్మిని సంపదకు దేవతగా భావిస్తారు. కుబేరుడి విగ్రహం ఆదాయాన్ని అందిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి, కుబేరుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది.

శంఖం-
వాస్తు శాస్త్రం ప్రకారం శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుంది. శాస్త్రాల ప్రకారం, లక్ష్మీ దేవి చేతులలో అందమైన శంఖం ఉన్న ఇళ్లలో, లక్ష్మీ దేవి స్వయంగా నివసిస్తుంది. అలాంటి ఇళ్లలో ఆర్థిక సమస్య ఉండదు.

ఒక కన్ను కలిగిన కొబ్బరికాయ..
ఒక కన్ను కలిగిన కొబ్బరికాయ కూడా ఉంటుందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగడం సహజం. ఒకే కన్నుగల నారికేళాన్ని’ఏకాక్షి నారికేళం’అని అంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ కొబ్బరికాయ దొరకడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో వుంచడం వలన సుఖసంపదలు … కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఏకాక్షి నారికేళం ఇంట్లో ఉన్నంత వరకూ ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు. ఎవరైనా అప్పుల బాధ పడుతున్నట్టయితే ఏకాక్షీ నారికేళాన్ని పూజ గదిలో వుంచినట్టయితే వెంటనే ఫలితం కనిపిస్తుంది.