Site icon HashtagU Telugu

Black Turmeric: అప్పుల బాధలతో సతమతమవుతున్నారా.. అయితే నల్ల పసుపుతో ఈ విధంగా చేయాల్సిందే?

Black Turmeric (2)

Black Turmeric (2)

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. సంపాదించిన డబ్బు చేతిలో మిగిలక పోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే మిమ్మల్ని కూడా ఆర్థిక సమస్యలు వేధిస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పినట్టు నల్ల పసుపుతో కొన్ని పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయట. అయితే ఇంతకీ నల్ల పసుపుతో ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే..

ఆర్థిక సంక్షేపం నుంచి బయటపడటం కోసం, ఆర్థిక సమస్యలు తీరడం కోసం నల్ల పసుపు, గోమతి చక్రం,వెండి నాణెం, గవ్వ.. ఇవన్నీ కూడా పసుపు రంగు వస్త్రంలో చుట్టాలట. ఈ మూటను ఎవరు తొక్కే ప్రదేశంలో ఉంచడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయట. ఆర్థిక పరిస్థితులు కూడా క్రమంగా మెరుగవుతాయని చెబుతున్నారు. అలాగే నల్ల పసుపును కుంకుమతో కలిసి ఎర్రటి వస్త్రంలో చుట్టాలట. గురువారం పుష్యమి నక్షత్రం కలిసిన రోజున ఆ మూటని డబ్బులు ఉంచే ప్రదేశంలో ఉంచాలట.

ఈ విధంగా చేయడం వల్ల ఇంటికి క్రమంగా డబ్బు రావడం పెరుగుతుందని చెబుతున్నారు. మీకు వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్నట్టయితే నల్ల పసుపుతో ఈ విధంగా చేయండి. నల్ల పసుపు నువ్వు కాస్త కుంకుమతో కలిపి వెండి గిన్నెలో ఉంచాలట. దీనిని లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం పాదాలకు తాకించి డబ్బులు ఉంచే ప్రదేశంలో ఉంచాలట. ఈ విధంగా చేయడం వల్ల వ్యక్తిగత సమస్యలు తొలగిపోయి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఇలాంటి పరిహారాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.

Exit mobile version