Site icon HashtagU Telugu

Black Ants: ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే ధనవంతులు అవుతారా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Black Ants

Black Ants

మామూలుగా ఇళ్లలోకి చీమలు ఉంటాయి. తీపి పదార్థాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడికి చీమలు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి. నల్ల చీమలు, ఎర్ర చీమలు, గండు చీమలు ఇలా రకరకాల చీమలు మనకు ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఎర్ర చీమలు కనిపిస్తే చాలామంది స్ప్రేలు చేయడం చాక్పీస్లు రాయడం వంటి వాటిని చేస్తూ ఉంటారు. చీమల వల్ల అనేక సమస్యలు, నష్టాలు ఉన్నాయని అంతా భయపడతారు. అవి ఆహార పదార్దాలను పాడు చేస్తాయని ఆందోళన చెందుతారు. అంతేకాదు వాటి వల్ల కొన్ని సందర్భాల్లో ఇంట్లో గోడలు కూడా దెబ్బతింటాయనే భయం కూడా ఉంది.

అందుకే చీమలు కనిపిస్తే చాలు వెంటనే వాటిని చంపాలని చాలామంది చూస్తారు. ఎక్కడ చీమలు కనిపిస్తే అక్కడ చీమల పొడి చల్లేస్తారు. లేదా లక్ష్మణ రేఖ గీస్తారు. అలా చీమలను తరిమి కొడతారు. అయితే వాస్తు ప్రకారం చీమలు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు. ఏ ఇంట్లో నల్ల చీమలు ఉంటే అక్కడ శుభప్రదం అంటున్నారు. ఆ ఇంట్లో వాళ్లు అభివృద్ధిలోకి వస్తారని చెబుతున్నారు. నల్ల చీమలు ఇంట్లోకి వచ్చాయంటే ఆ ఇంట్లో వాళ్లకు అదృష్టం పట్టినట్లే అంటున్నారు పండితులు. నల్ల చీమలు గుడ్లు పెట్టుకుని విపరీతంగా అంటే గుంపులు గుంపులుగా వందల్లో, వేలల్లో, లక్షల్లో నల్ల చీమలు మనకు కనపడినా, అవి మన ఇంట్లో తిరుగుతూ ఉన్నా అత్యంత శుభప్రదం అని చెబుతున్నారు.

అవి గుడ్లు పెట్టుకుని గుడ్లు మోస్తూ ఉండటం, వాటి సంఖ్య వృద్ది చెందటం అంటే ఆ ఇంట్లో వాళ్లు అత్యంత వేగంగా పురుష సంతానం అంటే పుత్ర సంతానం కలుగుతుందని అర్ధం అంటున్నారు. ఆ ఇంట్లో వారు అంతే అభివృద్ధి చెందుతారు. అలాగే వంశం అభివృద్ధి చెందటం, వాళ్లు చక్కగా అన్ని రంగాల్లో వృద్ధి చెందటం, ఆర్థికపరంగానూ వాళ్లు తొందరగా అభివృద్ధి చెందుతారట. చీమలు అనేవి మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తాయట. ఆర్థిక యోగాన్ని కూడా కలగజేస్తాయట. మన వంశం, సంఘాన్ని కూడా అభివృద్ది చేసేంత దిశగా అభివృద్ది జరుగుతుందట. ఎక్కడైతే నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ అంతా పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుందట. మనకు అదృష్టం పట్టినట్లే అని చెబుతున్నారు పండితులు.