Site icon HashtagU Telugu

Karthika Masam : బిహారీలు చత్​ పూజలు ఎందుకు చేస్తారు..?

Bihari Chhath Puja

Bihari Chhath Puja

కార్తీకమాసం (Karthika Masam) వచ్చిందంటే చాలు భక్తులంతా భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ఈ మాసంలో చాలామంది నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఎంతో భక్తితో ఆ పరమశివుడ్ని కొలుస్తూ నిత్యం దైవ జ్ఞానంలో ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్తీకమాసంలో అనేక రకాలపూజలు చేస్తూ ఉంటారు. ఇక బీహార్ రాష్ట్రంలో ఈ మాసంలో ఎక్కువగా చత్ పూజ (Bihari Chhath Puja) చేస్తుంటారు.

ఉత్తర ప్రదేశ్ (UP) రాష్ట్రాల్లోని ప్రజలు, ముఖ్యంగా హిందువులు, చాలా భక్తితో జరుపుకునే పండుగ ఇది. ఈ పూజ సూర్యభగవానునికి ప్రత్యేకంగా అర్పణ చేసే ఒక పవిత్ర కార్యక్రమం. చత్ పూజను బిహారీలు ప్రాముఖ్యంగా జరుపుకుంటారు. ఇది నాలుగు రోజులు జరిగే పండుగ. ఈ నాల్గు రోజులు ఉపవాసం, నదుల్లో పూజలు, సూర్యోదయం మరియు సూర్యాస్తమయానికి సూర్యుడిని ఆరాధించడం వంటివి చేస్తుంటారు.

చత్ పూజలో భక్తులు సూర్యుడికి మరియు ఛాతి మైయాకు నమస్కారం చేస్తారు. సూర్యుడు ఆరోగ్యానికి, శక్తికి మరియు ఆయుర్దాయానికి కారణమని భావిస్తారు. అందుకే ఈ పూజ ఆరోగ్యప్రదంగా, ఆయుర్దాయ ప్రదంగా ఉన్నందుకు ప్రసిద్ధి పొందింది. పూజకు సంబంధించిన వ్యక్తులు పండుగ సందర్భంగా కఠినమైన ఉపవాసం చేస్తారు. ఇది మానసిక మరియు శారీరక ప్రక్షాళనకు సంకేతంగా భావించబడుతుంది. చివరి రోజు నీటిలో నిల్చుని సూర్యోదయానికి పూజ చేసే ముందు భక్తులు కొన్ని గంటలపాటు నీరుపయోగం కూడా ఆపేస్తారు.

ఈ పూజ సందర్భంగా బిహారీలు సంప్రదాయ బట్టలు ధరిస్తారు. పండుగ సమయంలో ప్రత్యేక వంటకాలను తయారు చేస్తారు. పూజ సమయంలో పండ్లు, దోషాలు, కద్దు ప్రసాదం వంటి పక్వానాలు సూర్యుడికి సమర్పిస్తారు. చత్ పూజల్లో ముఖ్యమైనది సూర్యుడికి నైవేద్యం పెట్టడం .. మహిళలంతా కలిసి వెదురుబుట్టలు, గంపల్లో సీజనల్ పండ్లు పెట్టి పొద్దుపొడవంగానే సూర్యుడికి నైవేద్యం పెడతారు. కోర్కెలు తీరాలని, కష్టాలు దూరం కావాలని కోరుకుంటారు. ఉదయం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 వరకు మోకాళ్లలోతు నీళ్లలో నిలబడి సూర్యదేవుడిని ఆరాధిస్తారు.

ఇక కాగజ్​ నగర్​ సిర్పూర్ పేపర్ మిల్లు పే గ్రౌండ్ లో, పూజల కోసం ప్రత్యేకంగా నీటి కొలను ఏర్పాటు చేయించింది. ప్రతిసారి బిహారీలు ఇక్కడే పూజలు చేస్తున్నారు. దాంతో పూజలను చూసేందుకు పట్టణంలోని వేలాదిమంది ఎస్సీఎంగ్రౌండ్ కు వస్తుంటారు. కంపెనీ యాజమాన్యం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పూజల్లో పాల్గొంటారు.

Read Also : Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. సెర్చ్ ఆన్ వెబ్ పేరుతో కొత్త ఫీచర్!