Bhogi 2025: భోగి మంటల్లో భోగి పిడకలు ఎందుకు వేస్తారో మీకు తెలుసా?

భోగి పండుగ రోజు భోగి మంటల్లో పిడకలను వేయడం వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Bhogi 2025

Bhogi 2025

హిందువులు జరుపుకునే ముఖ్యమైన తొలి పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అందులో మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవరోజు కనుమగా జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాలలో నాలుగవ రోజు ముక్కనముగా కూడా జరుపుకుంటారు. అయితే భోగి అంటే తొలిరోజు అని అర్థం. ఈ రోజున అందరూ తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు చేసి ఇంటి ముందర భోగి మంటలు వేస్తూ ఉంటారు. భోగి అనే మాట.. భాగ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి తీవ్రత పెరుగుతుంది.

ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు వేడి కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. ఈ భోగి మంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా అని చెబుతున్నారు. ధనుర్మాసం నెల రోజులూ ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి పిడకలు అని అంటారు. వీటిని దండగా గుచ్చి భోగి రోజున వేసిన మంటల్లో వేస్తారు. ఇలా దేశి ఆవు పేడతో చేసిన పిడకలు మంటలో కలడం వలన గాలి శుద్ధి అవుతుంది. అలాగే గాలిలో సూక్ష్మ క్రిములు నశిస్తాయి. భోగి మంట కోసం ఎక్కువగా మామిడి, రావి వంటి ఔషధ గుణాలున్న చెట్ల కొమ్మలను ఉపయోగిస్తారు.

మంటను వేసే ముందు కట్టెలు త్వరగా అంటుకోవడానికి ఆవు నెయ్యిని నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. ఈ శుభ్రమైన గాలి మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. భోగి మంటల సమయంలో వెలువడే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. భోగి మంటలను అగ్నిదేవుడిని ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవంగా హిందువులు జరుపుకునే ప్రతి పండగకు కొన్ని నియమాలు ఉంటాయి. అయితే భోగి మంటల్లో రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని వేసి వాటిని మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి వాటిని వినియోగిస్తున్నారు. ఇలాంటి గాలిని పీల్చడం వలన ఊపిరితిత్తులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

  Last Updated: 03 Jan 2025, 03:22 PM IST