Bhanu Saptami: “భాను సప్తమి” ఈరోజే.. ఇవాళ ఏం చేయాలో.. ఏం చేయొద్దో తెలుసుకోండి..!

ఏ నెలలోనైనా "సప్తమి తిథి" ఆదివారం వస్తే.. దాన్ని  "భాను సప్తమి" లేదా  "రథ సప్తమి" అంటారు. సప్తమి తిథికి అధిపతి సూర్యుడు. ఫిబ్రవరిలో ఈరోజే (26వ తేదీ) భాను సప్తమి. ఇవాళ మధ్యాహ్నం 12:21 గంటలకు సప్తమి తిథి ప్రారంభం కానుంది.

  • Written By:
  • Publish Date - February 26, 2023 / 11:11 AM IST

ఏ నెలలోనైనా “సప్తమి తిథి” ఆదివారం వస్తే.. దాన్ని  “భాను సప్తమి” లేదా  “రథ సప్తమి” అంటారు. సప్తమి తిథికి అధిపతి సూర్యుడు. ఫిబ్రవరిలో ఈరోజే (26వ తేదీ) భాను సప్తమి. ఇవాళ మధ్యాహ్నం 12:21 గంటలకు సప్తమి తిథి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా  సూర్య భగవానుని  ఆరాధించడం, ఉపవాసం ఉండటం ముఖ్యం. ఈనేపథ్యంలో సూర్య భగవానుని భాను రూపాన్ని పూజిస్తారు. దీనివల్ల దుఃఖం, రోగాలు, పాపాలు నశిస్తాయి. సూర్యభగవానుని అనుగ్రహము వల్ల ధనము, వంశము, సుఖము వృద్ధి చెందుతాయి. ఈ రోజున సూర్యుడికి నీరు ఇవ్వడం వల్ల బుద్ధి పెరుగుతుంది. దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. భాను సప్తమి పుణ్య ప్రభావంతో తండ్రితో అనుబంధం బలపడుతుంది.

Also Read: Cholesterol: చేతుల నుంచి కాళ్ళ దాకా కొలెస్ట్రాల్ ముప్పు.. ఇలా చెక్ పెట్టొచ్చు..!

■ ఈరోజు ఇవి చేయాలి

ఈరోజు (ఫిబ్రవరి 26) సూర్యుడు ఉదయించే సమయంలో అర్ఘ్యం సమర్పించాలి. అంతేకాకుండా, ఎవరి జాతకంలో అయితే, మంగళ దోషం ఉంటుందో, వారంతా సూర్యుడిని ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల దోషం నుంచి విముక్తి లభిస్తుంది. భాను సప్తమి రోజున సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున నిద్ర లేవాలి. ఈ ఆదివారం రోజున తలకు నూనె, షాంపూ వంటివి రాసుకోకుండా స్నానం చేయాలి. ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి. వీలైతే కుంకుమ పువ్వు రంగులో ఉండే దుస్తులను దరిస్తే శుభ ఫలితాలొస్తాయి.ఒక రాగి పాత్రలో కుంకుమ, అక్షింతలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించే సమయంలో సూర్య భగవానుడి మంత్రాలను జపించాలి.భాను సప్తమి రోజున చేసే స్నానం, దానం, హోమం, పూజల వల్ల అనేక శుభ ఫలితాలొస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది.

■ ఈరోజు ఇవి చేయొద్దు

* భాను సప్తమి రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి.

* జీవిత భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు.

* భాను సప్తమి రోజున ఉపవాసం ఉండే వారు ఉప్పు తినకూడదు.

* భాను సప్తమి వంటి పవిత్రమైన రోజున ఎవరిపైనా కోప్పడకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి.