Devotional: పొరపాటున కూడా ఈ వస్తువులు దానం చేయకూడదు.. చేస్తే అలాంటి సమస్యలు తప్పవు!

దానం చేయడం.. ఇది ఒక గొప్ప మంచి అలవాటు అని చెప్పవచ్చు. ఆపదలో ఉన్నవారికి దానం చేయడం అన్నది

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 05:40 PM IST

దానం చేయడం.. ఇది ఒక గొప్ప మంచి అలవాటు అని చెప్పవచ్చు. ఆపదలో ఉన్నవారికి దానం చేయడం అన్నది నిజంగా గొప్ప విషయం. దానం చేయడం వల్ల ఇంత పుణ్యాన్ని కూడా పొందవచ్చు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అన్న విషయం మనం అందరికి తెలిసిందే. కనుక ఆకలి ఉన్నవారికి అన్నం దానం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతే కాకుండా ఒకరికి దానం చేయడం వల్ల మనం ఒకరికి మేలు చేసిన వాళ్లను కూడా అవుతాం. అయితే దానం చేయడం మంచిదే కానీ కొన్ని రకాల వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులలోను దానం చేయకూడదు.

మరి ఎటువంటి వస్తువులను దానం చేయకూడదు? అలా దానం చేస్తే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఎవరికైనా పాడైపోయిన ఆహారాన్ని పెట్టడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల జీవితం కూడా పాడైపోతుంది అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా స్టీల్ పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు అసలు దానం చేయకూడదు. వీటిని దానం చేయడం వల్ల ఆనందం దూరమవుతుంది. అలాగే మనం ఇంట్లో ఉపయోగించే నూనె కూడా అసలు దానం చేయకూడదు. దీనివల్ల కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి.

అదే విధంగా పుస్తకాలను కూడా ఎప్పుడు దానం చేయకూడదు. ఇది అస్సలు మంచిది కాదు. అదేవిధంగా చీపురుని కూడా దానం చేయకూడదు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. దీనిని దానం ఇస్తే సంపాదన కూడా కర్పూరంలా కరిగిపోతుంది అని నీకు నన్ను చెబుతున్నారు.