Bhajan- Govinda Nandanandana : గోవింద నందనందన భజన సాంగ్ విడుదల

కలకత్తాలోని శ్రీ గురువాయారప్పన్ ఆలయంలో ఇది శ్రీవిద్య శ్రీకృష్ణునికి పాడే నిర్మలమైన దృశ్యాలతో ఆత్మను హత్తుకునే భక్తి గీతం

Published By: HashtagU Telugu Desk
Bhajan Govinda Nandanandan

Bhajan Govinda Nandanandan

రక్షాబంధన్ (Rakshabandhan ) సందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు కలకత్తా కె శ్రీవిద్య (Carnatic musician, Calcutta K Srividya collaborates ) తన సోదరుడు, సంగీత స్వరకర్త, గాయకుడు మోహన్ కన్నన్ (అగ్నీ)తో కలిసి వారి తాజా గోవింద నందనందన (Govinda Nandanandana) అనే భజనను అందించారు. శ్రీవిద్య పాడిన గోవింద నందనందనుడు భజన శ్రీకృష్ణుని ఆవాహన చేస్తుంది. ఇద గోపిక కన్నుల ద్వారా భగవంతుని గురించి మాట్లాడుతుంది. శ్రీకృష్ణుడి బాల్యం, యవ్వనంలో ఎలా ఉండేవాడో ఒక ఉల్లాసభరితమైన భజన ద్వారా తెలుపుతుంది.శ్రీవిద్య తాళ్ళపాక అన్నమాచార్య సాహిత్యం ద్వారా గోవింద నందనందనతో మొదటిసారిగా తన స్వరకర్త భూమికని నిర్వహించింది.

కలకత్తా కె శ్రీవిద్యగా పిలవబడే శ్రీవిద్య (K Srividya, Srividya ) అత్యంత ప్రశంసలు పొందిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు గాత్రం, వయోలిన్ రెండింటిలోనూ ఈమె నిష్ణాతులు. ఆమె తన తల్లి, గురువు వసంత కన్నన్ నుండి సంగీతం నేర్చుకుంది. వసంత కన్నన్ ప్రపంచ ప్రఖ్యాత కర్ణాటక వయోలిన్ విద్వాంసురాలు. ఈ భజన శ్రావ్యతతో, శాస్త్రీయంగా ఉండటమే కాక నూతన తరం శాతబ్దాలను కూడా అడ్డంకులు లేని పద్ధతిలో మిళితం చేస్తుంది. శ్రీవిద్య కంపొజిషన్ చేస్తూ గాత్రంలో ప్రధాన భాగాన్ని అందించగా ఆమె సోదరుడు మోహన్ ఒక స్వరం పాడారు. ఇది పాటపై సాంప్రదాయేతర సంగీత విభాగాన్ని అందించింది. ఇందులో తబలా ప్రధాన భూమిక పోషించింది.

కలకత్తాలోని శ్రీ గురువాయారప్పన్ ఆలయంలో ఇది శ్రీవిద్య శ్రీకృష్ణునికి పాడే నిర్మలమైన దృశ్యాలతో ఆత్మను హత్తుకునే భక్తి గీతం. ఈ మ్యూజిక్ వీడియో సహజమైన శ్రీ గురువాయారప్పన్ ఆలయం అందాన్ని ప్రదర్శిస్తుంది. 7 సంవత్సరాల వయసు నుండి మోహన్, శ్రీవిద్య ఇండియా అంతటా అనేక కర్నాటిక్ క్లాసికల్ కచేరీలలో ప్రదర్శించారు. శ్రీవిద్య పాడటం లేదా వయోలిన్ వాయించడం, మోహన్ మృదంగం వాయించడం చేస్తుంటాడు. వారి మొదటి వాణజ్య స్టూడియో సహకారం 2011లో జాతీయ అవార్డు గెల్చుకున్న శాల కోసం సదా అనే పాటను కంపోజ్ చేసి పాడింది. సదా 2012లో వీడియో మ్యూజిక్ అవార్డుని కూడా గెల్చుకున్నారు. వారు తమ తల్లి స్వరపరిచిన థిల్లానాకు కూడా సహకరించారు.

సాంగ్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి ..

  Last Updated: 31 Aug 2023, 05:58 PM IST