Sri Sita Rama Kalyanam : భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు భద్రాద్రి రాముడి వివాహ మహోత్సవాన్ని వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వార్షిక షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది.
2025లో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాములవారి వార్షిక కళ్యాణం జరుపనున్నారు. ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాధివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, 5న ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జానకీరాముల కళ్యాణం, రాత్రి చంద్రప్రభ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తీరువీధి సేవ ఉంటుంది. ఏప్రిల్ 7వ సంవత్సరానికి మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
ఇకపోతే.. భక్తుల సంఖ్య ఆధారంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రాద్రి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఆ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఆ సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా వివరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా, భద్రాద్రి స్పెషల్ దర్శననాన్ని కూడా పునరుద్దరించారు.
ఈ సందర్భంగానే భద్రాచలం ఆలయ 2025 సంవత్సరం క్యాలెండర్‌ను రామాలయం ఈవో రమాదేవి, ప్రధానార్చకుడు విజయరాఘవన్ ఆలయ ప్రాంగణంలో గురువారం ఆవిష్కరించారు. ఈ ఏడాది 10వేల క్యాలెండర్లను ముద్రించారు. ఒక్కోదాని ధర రూ.120 అని పేర్కొన్నారు. కాగా, ఈ క్యాలెండర్.. పండుగలతో పాటు రామాలయంలో విశేషంగా నిర్వహించే ఉత్సవాలు, స్వామివారి వేడుకల చిత్రాలు, అనుబంధ కోవెలలోని విగ్రహాల చిత్రాలతో రూపొందించారు. అంతేగాక, రూ.75 ధరతో రామాయల డైరీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
Read Also: BRS: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న “దీక్షా దివస్”: పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు