Khammam: శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాచలం

  • Written By:
  • Updated On - April 10, 2024 / 09:25 PM IST

Khammam: శ్రీరామ నవమి వేడుకలకు అంకురార్పణతో భద్రాద్రికి కల్యాణ శోభ సంతరించుకుంటోంది. ఈ నెల 17 న సీతారాముల కళ్యాణం,18 న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది..దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు…అంగరంగ వైభవంగా జరుగు శ్రీరామనవమికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా పవిత్ర పావన గోదావరి నది నుండి తెచ్చిన జలంతో ఉగాది పచ్చడి తయారు చేసి ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

అనంతరం ఉత్సవారంభం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు…స్వామి వారికి స్నపన తిరుమంజనం మృత్ సంఘ గ్రహణం వేడుకలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల అంకు రార్పణ కి శ్రీశ్రీశ్రీ దేవనాద రామానుజ స్వామి హాజరయ్యారు.భద్రాచలంలో ఈ నెల 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు