Sleep: రాత్రి ఎటువైపు తిరిగి పడుకోవాలి.. ఉదయాన్నే ఎటువైపు నుండి లేవాలో తెలుసా?

మామూలుగా మన ఇంట్లో పెద్దలు పడుకునేటప్పుడు అటు తిరిగి పడుకో, ఇటు తిరిగి పడుకో అలా పడుకోవద్దు ఇలా పడుకో అని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అలాగే ఉ

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 08:57 PM IST

మామూలుగా మన ఇంట్లో పెద్దలు పడుకునేటప్పుడు అటు తిరిగి పడుకో, ఇటు తిరిగి పడుకో అలా పడుకోవద్దు ఇలా పడుకో అని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అలాగే ఉదయం ఉదయం నిద్ర లేచేటప్పుడు అటువైపు తిరిగి లేవకు ఇటువైపు తిరుగు అంటూ కొన్ని విషయాలు చెప్పినప్పుడు చాలామంది వాటిని మూఢనమ్మకాలు, చాదస్తం అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వాటి వెనకాల సైన్స్ దాగి ఉండడంతో పాటు ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది. కాగా పూర్వ కాలంలో పెద్దలు తమ పిల్లలకు నిద్రించు సమయంలో ఎడమవైపుకు తిరిగి పడుకోమని లేచే సమయంలో కుడివైపుకు తిరిగి లేవమని చెప్పేవారు. ఇందుకు గల ప్రధానకారణం భోజనం చేసిన తరువాత ఆహారం అంతయు జఠరకోశం నందు ఉండును.

ఆ ఆహారం జీర్ణం అయిన తరువాత జఠరకోశం నుండి చిన్నప్రేగులలోకి పోవుదారి కుడిపక్కనే ఉన్నది. జఠరకోశం నందు ఎంతకాలం జీర్ణక్రియ జరగవలెనో అంతే సమయం తీసికొనును గాని ఆ సమయం కంటే ముందుగా చిన్నప్రేగులలోకి పోయి జీర్ణక్రియ జరగదు. జఠరకోశంలో రెండు నుంచి మూడు గంటల సమయం ఆహారం వచనం జరిగిన అనంతరమే అది చిన్నప్రేగుల్లోకి ప్రవేశించును. ఎప్పుడైతే తిన్న ఆహారం జీర్ణం కాదో అప్పుడు జీర్ణకోశంలో కొన్ని తొందరలు ఉత్పన్నం అవుతుంది. దీని పరిణామముగా సరిగ్గా నిద్రరాకపోవుట, పీడకలలు, చిన్నగా కడుపునొప్పి వస్తుంది.
అదేవిధంగా హృదయం శరీరానికి ఎడమవైపు ఉండును. హృదయము నుండి శుద్ధరక్తం దేహమునందలి అన్ని అంగములకు సరఫరా చేయు ముఖ్యరక్తనాళం అయోర్టా ఇది హృదయమునకు కుడిభాగం నుండి మొదలగును.

మనం రాత్రి సమయం నందు కుడివైపుకు తిరిగి పడుకుంటే అయోర్టా నాళము నుండి ప్రవహించు శుద్ధరక్తం కొంచం ఎక్కువుగా స్రవించును. ఈ ఎక్కువ అయిన శుద్ధరక్తం రాత్రిపూట అనగా మనం రాత్రిపూట అనగా మనం నిద్రించు సమయంలో శరీరపు అంగాగములకు ఎక్కువ పరిణామములో అక్కరలేదు. మితముగా రక్తం సరఫరా అయినను చాలు. కుడివైపుకు తిరిగి పడుకుంటే మనం తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణంకాక మునుపే జఠరకోశం నుండి చిన్నప్రేగులలోకి బలవంతంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల కడుపులో వికారాలు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి రాత్రి పూట ఎడమవైపు తిరిగి మాత్రమే పడుకోవాలి. అలాగే మనం నిద్రలేచేటప్పుడు ఎడమవైపు తిరిగి లేచిన శరీరపు కొద్ది భారం ఎడమవైపు ఉన్న హృదయంపైన పడును.