Vastu Tips: పండుగ పూట ఈ నియమాలను పాటించకపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం ఖాయం?

హిందువులకు ఏడాది పరుగున ఒకదాని తర్వాత ఒకటి పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే అందులో కేవలం కొన్ని ముఖ్యమైన పండుగలను మాత్రమే సెలబ్రేట్ చేసు

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 08:30 PM IST

హిందువులకు ఏడాది పరుగున ఒకదాని తర్వాత ఒకటి పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే అందులో కేవలం కొన్ని ముఖ్యమైన పండుగలను మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నవరాత్రి, దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇలా పండుగల సందడి ఎక్కువే ఉంటుంది. ఇలా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క దేవుడుని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా పండుగ రోజుల్లో విశేషంగా పిండి వంటలు చేసుకొని దేవుళ్లకు నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇంట్లో, పరిసరాల్లో శుచి శుభ్రత, ప్రత్యేక వంటలు ఇలా చాలా చేయాల్సి ఉంటుంది. ఎక్కడా ఎలాంటి లోపం రానివ్వకూడదు. పండగ అనేది ఆ ఇంట్లో లేదా బంధువుల్లో ఆనందాన్ని తెస్తుంది.

పండుగ సమయంలో కొన్ని వాస్తు సూచనలు పాటించడం వల్ల నెగెటివ్ శక్తుల్ని దూరం చేయవచ్చంటారు. అంతేకాకుండా ఆ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయని అంటారు. అయితే పండుగ సమయాలలో కొన్ని రకాల సూచనలను పాటించకపోతే దరిద్రం పట్టి పీడిస్తుంది అంటున్నారు పండితులు. మరి పండుగ సమయాలలో ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పండుగ వేలలో మీకంటే పెద్దవారు ముసలివారు వృద్ధులను ఎట్టి పరిస్థితులలో అవమానపరచకూడదు. ప్రత్యేకించి అగౌరవంగా, అసాంఘికంగా మాట్లాడకూడదు. పండుగ పర్వదినం సమయంలో ఎవరి మనసూ నొప్పించకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్త పడాలి.

పెద్దవారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. ఇంట్లో లేదా బయట పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవాలి. పండుగ సమయంలో ఇంట్లో ఏదైనా విరిగిన వస్తువులు ఉంటే బయట పారేయాలి. ఇంట్లో అలాంటివి లేకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే అది అశుభానికి సూచకం. దీనివల్ల అపరిశుభ్రత నెలకొంటుంది. ఇంటి పరిసరాలు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా వస్త్రధారణపై కూడా శ్రద్ధ పెట్టాలి. పండుగ వేళ చిరిగిన బట్టలు ధరించకూడదు. ఇది అంత మంచిది కాదు. చిరిగిన బట్టలు ధరిస్తే అది ఆ ఇంట్లో నెగెటివ్ శక్తులకు కారణం అవుతుంది. అంటే కొంతమంది ఫ్యాషన్ పేరుతో రంధ్రాలు, చిరిగిన జీన్స్ ధరిస్తుంటారు. ఇలాంటివి మానేయాలి. సంస్కృతీ సాంప్రదాయాల్ని గౌరవించే బట్టలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేకించి పండుగ సమయాల్లో వాస్తు సూచనల్ని తప్పకుండా పాటించాలి. ఇక పైన చెప్పిన విషయాలను పండుగ సమయాలలో పాటించడం వల్ల దేవుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. అలాగే ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి ఈజీగా బయటపడవచ్చు.