నడక మంచిదే.. ప్రతిరోజు కొద్దిసేపు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఫిట్ గా ఉంటారని ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. సమయం అనుకూలాన్ని బట్టి కొండరు సాయంత్రం పూట నడిస్తే మరి కొందరు ఉదయం పూట నడుస్తూ ఉంటారు. అయితే ఈ రెండు సమయాల్లో ఏది మంచిది. అసలు ఏ సమయంలో నడిస్తే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా ఉదయం నడక వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే.. ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ ఇంటి ఆవరణ ప్రాంతంలో లేదంటే రోడ్డుపై పార్కుల ప్రదేశంలో నడవడంతో పాటు చిన్నపాటి ఎక్సర్సైజులు చేయడం వల్ల శారీరక అలాగే మానసిక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
నడక వల్ల పనుల్లో క్లారిటీ వస్తుంది. ఫోకస్ పెరుగుతుంది. మెటబాలీజం పెరిగి బరువు తగ్గుతారు. ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. పార్క్ లలో లేదా చెట్ల మధ్య తిరిగితే ప్యూర్ ఆక్సీజన్ అందుతుంది. చేసే పనుల్లో క్రియేటివిటీ, ప్రొడెక్టివిటీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇక సాయంత్రం నడక వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే.. ఉదయం పనుల్తో సమయం కుదరదు అనుకున్న వాళ్లు సాయంత్రం హాయిగా నడవచ్చు. దీనివల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుంది. అలాగే మంచిగా రిలాక్స్ అవుతారు. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారికి ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
జీర్ణసమస్యలు దూరమై గట్ హెల్త్ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయం లేదా సాయంత్రం ఈ రెండింటిలో ఏ సమయం బెస్ట్ అన్న విషయానికి వస్తే..ఉదయం నడిచినా.. సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలే అందుతాయి. కాబట్టి మీకు ఏ సమయం అనువుగా ఉంటుందో చూసుకోవాలి. అంతేకాకుండా వాతావరణం ఏ సమయంలో అనుకూలంగా ఉందో చూసుకుని వాక్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. కాబట్టి వ్యక్తిగత సమయాలకు అనుగుణంగా దీనిని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే కొందరు అదే పనిగా ఎక్కువ నడుస్తారు. అది మంచిది. ఒకవేళ మీరు వాక్ చేయాలనుకుంటే మొదటి రోజు ఎక్కువ నడిచేసి, తర్వాత తగ్గించడం కాకుండా, మీరు రోజూ ఒకటే దూరం వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది మీకు అలవాటు అయితే ఆ తర్వాత దూరాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.