Panchamukhi Hanuman: కష్టాలు చుట్టుముట్టాయా..పంచముఖి హనుమంతుడిని ఆరాధించండి..!!

జీవితంలో ఎన్నో కష్టనష్టాలు..సుఖసంతోషాలు ఉంటాయి. అవన్నీ ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ కొందరికి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
hanuman

hanuman

జీవితంలో ఎన్నో కష్టాలు.నష్టాలు..సుఖసంతోషాలు ఉంటాయి. అవన్నీ ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ కొందరికి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తికావు. ఇంట్లో సమస్యలు. ఆర్థిక సమస్యలు, ఆర్థిక సమస్యలు. ఇలా ఎన్నో ఎదుర్కొంటారు. అయితే మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక ఆరాధన చేసినట్లయితే…జీవితంలో కష్టాలకు అడ్డుకట్ట వేయవచ్చు. పంచముఖి హనుమంతుని పూజిస్తే…ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. పంచముఖి హనుమాన్ ను పూజిస్తే..సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీరామునికి సహాయం చేసేందుకు …హనుమంతుడు పంచముఖి అవతారాన్ని ఎంచుకున్నాడు.

పంచముఖి హనుమంతుడు…వానర, గరుడ, వరాహ, గుర్రం, నరసింహ ముఖాలతో హనుమంతుని ప్రతిముఖాన్ని పూజిచండం వల్ల ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. శుత్రువుల పతానానికి వానర ముఖం, అని కష్టాలను తొలగించే గరుడ ముఖం, దీర్ఘాయిువు కోసం వరాహ ముఖం, అపారమైన శక్తి, కీర్తిని కలిగించే ముఖం, ఒత్తిడిని భయాన్ని నశింజేసే నరసింహముఖం…అన్ని కోరికలను నెరవేర్చడానికి అశ్వ ముఖం అని భావించబడుతుంది. మీ జీవితంలో సమస్యలు చుట్టుముట్టినట్లయితే…మీరు పంచముఖి హనుమన్ ను పూజించాలి. మంగళవారం నాడు పంచముఖి హనుమంతుడిని ఆరాధిస్తే…కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రువుల భయం, ఆర్థిక అవరోధాలు, రోగాలు మొదలైనవి విముక్తితో పాటు మనిషికి సంఘంలో గౌరవం ప్రతిష్టలు లభిస్తాయి.

 

  Last Updated: 26 Jun 2022, 11:48 PM IST