Vishnu: విష్ణువుని పూజించడం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా?

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో విష్ణువు కూడా ఒకరు. అంతేకాకుండా త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు కూడా ఒకరు అ

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 08:51 PM IST

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో విష్ణువు కూడా ఒకరు. అంతేకాకుండా త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు కూడా ఒకరు అన్న విషయం అందరికీ తెలిసిందే. హిందూ మతానుసారం సృష్టికి సంరక్షకుడు, రక్షకుడు మహా విష్ణువు. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వస్వం వ్యాపించినవాడు. పురాణాల ప్రకారం 22 సార్లు పునర్జన్మ పొందాడు మహా విష్ణువు. అందులో సృష్టిని రక్షించడానికే 10 జన్మలను ఎత్తేడు. నరసింహుని పురాణం విష్ణువు
సర్వవ్యాప్తి అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. కృష్ణుని రూపంలో భగవంతుడు కర్మయోగం ప్రాముఖ్యత ఏమిటో తెలిపాడు.

అయితే విష్ణుమూర్తికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజలు చేసి ఆరాధిస్తూ ఉంటారు. హిందూ మతం ప్రకారం రెండు పూజా విధానాలు వాడుకలో ఉన్నాయి. ఒకటి దేవునికి నిన్ను నువ్వు అర్పించుకోవడం,మరొకటి లోతైన భక్తితో కూడిన నిశ్శబ్ద ప్రార్థనతో స్వామి వారిని ఆరాధించడం. అందుకే భగవంతుడిని పూర్తి భక్తితో ప్రార్థించి, అంతరంగాన్ని శుభ్రపరచడానికి అతని నామాన్ని జపించాలి. అలాగే విష్ణువును గుర్తు చేసుకోవడానికి మనకు అనేక రకాల పండుగలు కూడా ఉన్నాయి.అవి చాతుర్మాస, జన్మాష్టమి, గోకుల-అష్టమి, రామనవమి, అక్షయతృతీయ, దత్తజయంతి, దీపావళి ఇలా చాలా రకాల పండుగలను ఏడాది పొడవునా జరుపుకుంటూ విష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.

ఇకపోతే విష్ణువును పూజించడం వల్ల కలిగే ఫలితాల విషయానికి వస్తే. విష్ణువు ఎదుట ఎటువంటి కోరిక లేకుండా ప్రార్థించడం. భగవంతుడే భక్తుని కోరిక తెలుసుకుని తీరుస్తాడు. శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల శాంతి, విముక్తి లభిస్తుంది. విష్ణువును పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం. కాబట్టి శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ప్రత్యేక రోజుల్లో పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.