Site icon HashtagU Telugu

‎Widow Women: వితంతువులు బొట్టు పూలు పెట్టుకోవచ్చా.. పెట్టుకోకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే!

Widow Women

Widow Women

‎Widow Women: భారతీయ స్త్రీలు తలలో పూలు ధరించడం అన్నది ఒక రకమైన సంప్రదాయం ఆచారం. ఇక పెళ్లి అయిన ఆడవారికి అయితే నుదుటిన బొట్టు జడలో పువ్వులు పెట్టుకోవడం అన్నది తప్పనిసరి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా స్త్రీలు బొట్టు పెట్టుకొని పూలతో అందంగా అలంకరించుకోవడం వల్ల నిండుగా కనిపిస్తారని చెబుతుంటారు. పువ్వులలో ముఖ్యంగా మల్లెపూల వాసన కోపాన్ని తగ్గించి, మానసిక ఒత్తిడిని నియంత్రించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుందని చెబుతున్నారు. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల మానసిక ఆనందం, ఉత్సహం పెరుగుతుందట.

‎అలాగే మానసిక ప్రశాంతత, సానుకూల భావాలు కూడా వెలువడుతాయట. అంతేగాక మల్లెపూలు పెట్టుకోవడం వల్ల పీనియల్ గ్రంథి ఉత్తేజితమవుతుందని చెబుతున్నారు. కాగా తలలో పూలు పెట్టుకోవడం వల్ల మెదడులోని కొన్ని ముఖ్యమైన గ్రంథులు ఉత్తేజితమవుతాయట. వాటిలో ముఖ్యంగా సెరోటోనిన్ వంటి ఆనందాన్ని కలిగించే హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథులు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. ఇది మానసిక స్థితిని సమతుల్యం చేస్తుందట. దీని వల్ల మహిళలు మరింత ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మల్లెపూల వాసన నిద్రలేమి సమస్యను తగ్గించడంలో, మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుందట.

‎ పూలు పెట్టుకోవడం వల్ల మహిళలలో అందం, ఆత్మవిశ్వాసం, ఆకర్షణ పెరుగుతుందని, మనసును కూడా శాంతింపజేసే శక్తి వీటి సొంతం అని చెబుతున్నారు. ఇకపోతే ఆధ్యాత్మిక పరంగా తలలో పూలు పెట్టుకోవడం వల్ల మహాలక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ ఆచారం ఇంట్లో ఐశ్వర్యం, సమృద్ధి, శుభశక్తుల ప్రసరణకు దోహదపడుతుంది. అయితే భర్త చనిపోయాక స్త్రీలు పూలు పెట్టుకోవచ్చా? అనే సందేహం చాలామందికీ ఉంటుంది.కానీ ఈ వాదన పూర్తిగా తప్పట. పూలు మహిళకు పుట్టుకతోనే సంక్రమిస్తాయి. కాబట్టే అవి ఆమె వ్యక్తిత్వానికి, ఆనందానికి, ఆత్మవిశ్వాసానికి గుర్తుగా ఉంటాయని, భర్త లేని మహిళలు పూలు పెట్టుకోవద్దని, బొట్టు పెట్టుకోవద్దని చెప్పడం ఒక సాంఘిక నిర్మితి మాత్రమేనని, అది మహిళలను ఒంటరితనంలోకి నెట్టే ఆచారమని చెబుతున్నారు. నిజానికి, ప్రతి మహిళ జీవితంలోని ఏ దశలోనైనా పూలు ధరించవచ్చట, అది ఆమె హక్కు, ఆనందం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందట.

Exit mobile version