Shankha: ఏంటి! ఇంట్లో శంఖం ఊదడం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?

మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ శంఖాన్ని ఊదడం చూసే ఉంటాం. మరి ముఖ్యంగా ఎక్కువగా శివాలయాల్లో శంఖాన్ని ఎక్కువగా ఊదుతూ ఉం

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 09:10 PM IST

మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ శంఖాన్ని ఊదడం చూసే ఉంటాం. మరి ముఖ్యంగా ఎక్కువగా శివాలయాల్లో శంఖాన్ని ఎక్కువగా ఊదుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో శంఖాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కాగా శంఖానికి భారతీయ పురాణ ఇతిహాసాలలో ప్రాధాన్యత కూడా ఉంది. సముద్ర గర్భంలో దొరికే ఈ శంఖానికి భగవంతునితో అనుబంధం ఉంది. క్షీరసాగర మదనంలో శంఖం ముందు పుట్టి తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించిందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది. శంఖం నుంచి ఓంకార శబ్దం వెలువడుతుందని అందరికీ తెలిసిందే.

అందుకే మన హిందుత్వ ఆధ్యాత్మిక మార్గంలో శంఖంకి ప్రత్యేక స్థానం ఉంది. యుద్ధం ఆరంభం సమయంలో శంఖాన్ని పూరించడం శుభసూచకంగా భావిస్తారు. ఇంట్లో శంఖం శబ్దాన్ని పూరిస్తే మంచి జరుగుతుందట. ప్రతిరోజు నాలుగు సార్లు శంఖం ఊదిన వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఆధ్యాత్మిక గురువులు కూడా తెలియజేశారు. ఇంట్లో శంఖం పెట్టుకొని పూజిస్తే ప్రతికూల వాతావరణం పూర్తిగా మాయం అవుతుంది. శంఖంకి ఉండే ఆధ్యాత్మిక శక్తి కారణంగా ఏ ఇంట్లో ఇది ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు.

అదేవిధంగా వాస్తు దోషాలు కూడా అవి తొలగిపోతాయి. శంఖం ఏ ఇంట్లో అయితే పెట్టుకుని పూజిస్తారో ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అల్వ్ శంఖం నుంచి ఉద్భవించే ఓంకార నాదాన్ని ప్రతిరోజు వినడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.