Saturday: చాలామంది వాస్తు శాస్త్ర ప్రకారం అనేక విషయాలను పాటిస్తూ ఉంటారు. వీటి వల్ల అంతా మంచి జరుగుతుందని, ఆర్థిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయని నమ్ముతూ ఉంటారు. అందుకే చాలామంది చాలా విషయాలలో వాస్తు విషయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అయితే అలా వాస్తు ప్రకారం శనివారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. మరి ఇంతకీ శనివారం రోజు ఏం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై గుర్రపు నాడాను తగిలించడం శుభప్రదంగా పరిగణించాలట. దీన్ని తగిలించడం వల్ల ప్రతికూల శక్తి రాదని చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుర్రపు నాడాను తగిలించడం వల్ల ధన లాభం కలుగుతుందట. అలాగే దుఃఖం,దారిద్ర్యం కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఇనుప గుర్రపు నాడాను శనివారం లేదా అమావాస్య రోజున మాత్రమే తలుపు మీద పెట్టాలని,ఈ రోజున ప్రధాన ద్వారం మీద గుర్రపు నాడాను పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.
గుర్రపు నాడా చెడు దృష్టి నుంచి ఇంటిని రక్షిస్తుందట. అలాగే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందట. ఇంటి ప్రధాన ద్వారంపై గుర్రపు నాడాను అమర్చేటప్పుడు, దాని రెండు చివరలు పైకి ఉండేలా చూసుకోవాలట. గుర్రపు నాడా సుఖసంతోషాలకు చిహ్నంగా భావించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే ఈ గుర్రపు నాడా అమర్చేవారు ఆ విషయంలో సరైన అవగాహన లేని వారు నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాకాకుండా ఎలా పడితే అలా బిగిస్తే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Saturday: శనివారం రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. కాసుల కురవాల్సిందే!

Saturday