Site icon HashtagU Telugu

Basil Leaves: రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Basil Leaves

Basil Leaves

హిందూమతంలో తులసి మొక్కను పరమపవిత్రంగా భావిస్తారు. అంతే కాకుండా తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేసి భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఇక హిందువుల ఇండ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. అయితే తులసి మొక్క వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తులసి మొక్క వల్ల ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా ఒకటి. కాగా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను రెండింటిని తుంచి ఆ ఆకులను దిండు కింద పెట్టుకొని పడుకోవాలట.

ఇలా చేస్తే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నాయి. ఇలా దిండు కింద తులసి ఆకును ఉంచడం వల్ల ప్రతికూలత తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తే మీరు తప్పనిసరిగా మీ దిండు కింద ఒక తులసి ఆకును ఉంచుకోవాలట. దీనితో మీకు చెడు ఆలోచనలు రావు. మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా తులసి ఆకులను దిండు కింద ఉంచితే మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుందట. ఏదైనా మానసిక అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది కూడా పోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, కోపాన్ని నియంత్రించడంలో కూడా ఇది మీకు చాలా సహాయపడుతుంది.

విపరీతమైన కోపం ఉన్నవారు రెండు తులసి ఆకులను రోజూ దిండు కింద పెట్టుకొని పడుకుంటే కోపం తగ్గిపోతుందట. దిండు కింద ఒక తులసి ఆకును ఉంచడం ద్వారా, చెడు శక్తులు మిమ్మల్ని ప్రభావితం చేయలేవని చెబుతున్నారు. అలాగే మీపై ఎదైనా చెడు కన్ను పడినా ఆ దిష్టి కూడా పోతుందని పండితులు చెబుతున్నారు. దిండు కింద తులసి ఆకును ఉంచడం వల్ల గ్రహాలు కూడా ప్రశాంతంగా ఉంటాయట. గ్రహాల నుండి లభించిన అశుభం తొలగిపోవడం ప్రారంభమవుతుందట. గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే తులసి ఆకులను డైరెక్ట్ గా పెట్టకుండా ఎర్రటి వస్త్రంలో పెట్టి అప్పుడు తల కింద పెట్టుకుంటే ధన ప్రవాహం పెరుగుతుందని చెబుతున్నారు. ఎక్కడైనా ధనం రావాల్సి ఉన్నా ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి డబ్బు మీ చేతికి చేరుతుందని పండితులు చెబుతున్నారు.