Site icon HashtagU Telugu

Vasthu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ బొమ్మలు ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Vasthu Tips

Vasthu Tips

హిందువులు వాస్తు శాస్త్రాన్ని బాగా గట్టిగా నమ్ముతూ ఉంటారు. వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇంట్లో ఉండే వస్తువులు ఫోటోలు ప్రతి ఒక్కటి కూడా వాస్తు ప్రకారం అమర్చుకుంటూ ఉంటారు.అలా ఇంట్లో కొంతమంది జంతువుల ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మరి వాస్తు ప్రకారం ఇంట్లో ఏఏ జంతువుల బొమ్మలు ఏ దిక్కున పెట్టకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామంది ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాలు లేదంటే ఇతడి విగ్రహాలు, ఏనుగుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. శక్తి, బుద్ధి, స్థిరత్వానికి చిహ్నం ఏనుగు. ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టడం వల్ల డబ్బు బాగా పెరుగుతుందట. వ్యక్తి, కుటుంబ వైభవం కూడా పెరుగుతుందని నమ్మకం. ఈ ఏనుగు బొమ్మలను ఈశాన్యం లేదా ఉత్తర దిక్కులో ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే గుర్రాలు శక్తిని, వేగాన్ని, విజయం సాధించడంలో సహాయపడతాయట. ముఖ్యంగా వ్యాపారంలో సక్సెస్ రావాలంటే గుర్రం బొమ్మలు పెట్టుకోవడం మంచిదని, వాటిల్లోనూ పసుపు గోధుమ గుర్రం బొమ్మలను పెట్టడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి అని పండితులు చెబుతున్నారు. ఈ గుర్రం బొమ్మలను ఇంట్లో దక్షిణ లేదా పశ్చిమ దిశల్లో ఉంచితే విజయం కలుగుతుందట.

ప్రేమ, శాంతి, ఐక్యతకు నిదర్శనం పావురం. కాబట్టి పావురం బొమ్మలు ఇంట్లో పెట్టడం వల్ల కుటుంబంలో శాంతి, ఐక్యత పెరుగుతాయట. వీటిని ఇంట్లో ఉత్తర లేదా పశ్చిమ దిశలో ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. కోతులు తెలివి, చురుకుదనానికి గుర్తు. కోతి బొమ్మలు పెట్టడం వల్ల ఇంట్లో ఉండే వారికి ఆలోచనా శక్తి మెరుగవుతుందట. ముఖ్యంగా విద్యార్థులకు ఇది మంచి ఫలితాలని అందిస్తుందని,టిని ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచాలని చెబుతున్నారు. అలాగే ధైర్యం, బలం, రక్షణకు చిహ్నం ఈ క్రూర జంతువులు. సింహం, పులి బొమ్మలను ఇంట్లో పెట్టడం వల్ల ఆ ఇంటికి భద్రత, శక్తిని తీసుకువస్తాయని నమ్మకం. ఈ బొమ్మలను దక్షిణ దిశలో ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉడుత బొమ్మలను ఉంచడం వల్ల ఆలోచనా శక్తి, వివేకం పెరుగుతుందని నమ్మకం. ఇది విద్యార్ధుల గదిలో లేదా ఉత్తర దిక్కులో ఉంచడం మంచిదని చెబుతున్నారు. అందం, ధనం, వైభవం కలగాలంటే నెమలి బొమ్మలను ఇంట్లో పెట్టుకోవాలట. నెమలి బొమ్మలు లేదా వాటి ఫొటోలను ఇంట్లో ఉండటం వల్ల శాంతి, సంపద, ప్రతిష్ట పొందవచ్చట. ఈ నెమలి బొమ్మలను పశ్చిమ లేదా ఉత్తర దిశలో ఉంచడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.