పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఈ రోజున ఆయన భక్తులు ఆయనను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు, ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున రాత్రి మొత్తం మేలుకొని శివయ్య నామ స్మరణ చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ శివరాత్రి పండుగ రోజు చేసే ఉపవాసం వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.. మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే శరీరంలో జీర్ణక్రియ, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందట.
ఉపవాసం, ధ్యానం మంత్రోచ్చరణలు ఆందోళన, చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గించి మనసును, శరీరాన్ని స్థిరపరుస్తాయట. ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు నశిస్తాయి. జీర్ణం కాని ఆహారాన్ని తొలగించటంలో ఉపవాసం సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఉపవాసంలో కూడా చాలా రకాలు ఉపవాసాలు ఉన్నాయి. వాటిలో ఏది అన్నది మీరు ముందుగా నిర్ణయించుకోవాలని చెబుతున్నారు. మానసిక స్పష్టత కోసం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఉపవాసం చేసేవారు ఈ ధ్యానాన్ని పదేపదే తలుచుకుంటూ మనసులు అనుకుంటూ ఉండాలట.
ఈ రోజున పరమేశ్వరుడికి బిల్వ దళాలు, నీరు పాలు వంటికి సమర్పించాలని చెబుతున్నారు. అలాగే రాత్రి జాగరణ చేసి మెలకువగా ఉండాలట. ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా నిలబెట్టుకోవడానికి పీచు అధికంగా ఉన్న, అధిక కొవ్వు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. అంటే నెయ్యి, గింజలు, పనీర్, పెరుగు, కొబ్బరి, పండ్లు వంటివి తీసుకోవాలి. ఉపవాస అనంతరం మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజు ఉపవాసం జాగరణ చేసేవారు. ఆరోజు మొత్తం కొంచెం పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం చేయాలి. మరుసటి రోజు రాత్రి చందమామను చూసిన తర్వాత నిద్రపోవాలి. అప్పుడే మీరు ఉపవాసం జాగరణ చేసిన ఫలితం దక్కుతుందని చెబుతున్నారు..