Site icon HashtagU Telugu

Conch Shell : మీ ఇంట్లో కూడా శంఖం ఉందా.. అయితే ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే?

Mixcollage 18 Jan 2024 02 41 Pm 7140

Mixcollage 18 Jan 2024 02 41 Pm 7140

మామూలుగా చాలామంది ఇంట్లో ఎన్నో రకాల వస్తువులను అలంకరణగా పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొందరు వాటిని ఆధ్యాత్మికంగా వాస్తు ప్రకారం గా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో శంఖం కూడా ఒకటి. చాలామంది శంఖాన్ని సెల్ఫుల్లో అలంకరణగా పెట్టుకుంటే ఇంకొందరు పూజ గదిలో పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. చాలామంది పూజల్లో కూడా శంఖాన్ని ఊదుతుంటారు. ముఖ్యంగా పరమేశ్వరుడి ఆలయాల్లో దేవుడికి హారతులు ఇచ్చేటప్పుడు ఈ విధంగా శంఖాన్ని ఊదుతూ డమరుకాలు వాయిస్తూ ఉంటారు. శంఖం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది చెబుతుంటారు.

అసలు శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఒకవేళ ఇంట్లో శంఖం ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శంఖానికి సనాతన సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. శంఖం అంటేనే పవిత్రతకు మారుపేరు. శంఖాన్ని పూజిస్తే దేవుడిని పూజించినట్టే. శంఖం ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవినే ఇంట్లో ఉన్నట్టు భావిస్తారు. శంఖం పాపాలను నాశనం చేస్తుంది. దీర్ఘాయిష్షును ప్రసాదిస్తుంది. అలాగే ప్రతిరోజు శంఖాన్ని ఇంట్లో ఉండడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అయి ధృఢంగా మారుతాయి. శ్వాస సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి.

శంఖం ఇంట్లో ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. సిరిసంపదలు వస్తాయి. శంఖంలో నీటి నిలువ చేసి తాగితే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శంఖం అనేది పాజిటివ్ ఎనర్జీకి సంబంధించింది. అది ఇంట్లో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి పారిపోతుంది. ఇంట్లో ఉన్నవాళ్లు పాజిటివ్ గా ఉంటారు. అందుకే చాలామంది ఇంట్లో శంఖాన్ని పెట్టుకుంటారు. మీరు కూడా వీలైతే ఇంట్లో శంఖాన్ని పెట్టుకోవడం మంచిది. శంఖం ఇంట్లో ఊదడం వల్ల నెగటివ్ ఎనర్జీ పారిపోయి ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండుకుంటుంది.